Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీమిండియా కోచ్ రేసులో లాంగర్, ఫ్లవర్

Published: Monday, May 18, 2015, 12:07 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌ రేసులో ఉన్నట్లుగా మాజీ ఆస్ట్రేలియా ఓపెన ర్‌ జస్టిన్‌ లాంగర్‌ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. డంకన్ ఫ్లెచర్ పదవీకాలం ముగిసిన తర్వాత టీమిండియా కొత్త కోచ్‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోచ్ అవతారమెత్తనున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అంతేగాక, ప్రస్తుతం టీమ్ డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రికే ఈ బాధ్యతలూ అప్పగిస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ పేరును చీఫ్ కోచ్ పదవికి పరిశీలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

ప్రస్తుతం షెఫీల్డ్, బిగ్‌బాష్ లీగ్‌లలో వెస్టర్న్ ఆస్ట్రేలియాకు కోచ్‌గా వ్యవహరిస్తున్న లాంగర్‌కు వ్యూహాల పుట్ట అన్న పేరుంది. దీంతో అతడ్ని కోచ్‌గా నియమించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనేగాక, ఇంగ్లండ్ మాజీ చీఫ్ కోచ్, జింబాబ్వే మాజీ ఆటగాడు ఆండీ ఫ్లవర్ పేరునూ కోచ్ పదవికి పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Justin Langer in Line for Job as Team India Coach: Report

స్నేహం కోసం సిరీస్ జరగాలి

కోల్‌కతా: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య సత్సంబంధాలు, స్నేహం బలపడ డం కోసం ద్వైపాక్షిక క్రికెట్‌ను పునరుద్దరించాల్సిందేనని కేంద్ర క్రీడాశాఖ మంత్రి సర్బనంద సోనోవాల్ అన్నారు. క్రీడాశాఖ మంత్రిగా క్రీడాభివృద్ధి తన ప్రధాన ధ్యేయమని చెప్పారు.

ద్వైపాక్షిక సం బంధాలు మెరుగుపడడం కోసం భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ సిరీస్ జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కానీ దానికంటే ముందే అడ్డంకులను, సమస్యలను పరిష్కారమవ్వాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.

English summary
Former Australia opener Justin Langer has suddenly cropped up as one of the possible candidates for Indian cricket team's chief coach's job, a position that is lying vacant after Zimbabwean Duncan Fletcher completed his tenure at the end of the World Cup.
మీ వ్యాఖ్య రాయండి