Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి స్థానంలో గంగూలీ?

Published: Monday, May 18, 2015, 18:10 [IST]

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా జగ్మోహన్ దాల్మియా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో, సహాయక సిబ్బందిలో పలుమార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత జట్టు డైరెక్టర్‌గా ఉన్న రవిశాస్త్రి బదులు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వైపు బిసిసిఐ చీఫ్ జగన్మోహన్ దాల్మియా మొగ్గు చూపుతున్నారు.

సుదీర్ఘంగా టీమిండియాకు కెప్టెన్‌గా సేవలందించిన గంగూలీ జట్టును ఉన్నతస్థాయిలో నిలుపుతాడనడంలో ఎటువంటి సందేహాం లేదు. గత గంగూలీ రికార్డులను పరిగణలోకి తీసుకోన్న బీసీసీఐ ఆ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Sourav Ganguly to replace Ravi Shastri as Team Director?

అంతే కాకుండా, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్‌లకు కూడా బిసిసిఐలో మంచి పదవులు అప్పజెప్పే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉండగా, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్‌లను తిరిగి జట్టులోకి తీసుకోనున్నట్లు సమాచారం. వీరందరినీ త్వరలో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టులో సభ్యులుగా చేర్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

English summary
It is now more or less clear that former tainted Board of Control for Cricket in India chief N Srinivasan has lost the battle with cricket’s governing body in the country.
మీ వ్యాఖ్య రాయండి