Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జింబాబ్వేతో టీ20: సానియా భర్త మాలిక్‌కు చోటు

Posted by:
Published: Tuesday, May 19, 2015, 17:32 [IST]

న్యూఢిల్లీ: మూడు సంవత్సరాల తర్వాత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీకి పాకిస్ధాన్ క్రికెట్ సెలక్టర్లు జట్టులో చోటు కల్పించారు. జింబాబ్వేతో జరగనున్న రెండు ట్వంటీ20 మ్యాచ్‌ల కోసం పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు జట్టుని బోర్డు మంగళవారం ప్రకటించింది.

34 ఏళ్ల మొహమ్మద్ షమీ తన చివరి ట్వంటీ20 మ్యాచ్‌ని జూన్ 2012లో శ్రీలంకతో ఆడారు. జింబాబ్వేతో జరిగే ట్వంటీ20 మ్యాచ్‌ల కోసం ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్‌ జట్టులో స్ధానం సంపాదించాడు. షోయబ్ మాలిక్ తన చివరి ట్వంటీ20 మ్యాచ్‌ని 2014న బంగ్లాదేశ్‌పై ఆడారు.

Shoaib Malik recalled to Pakistan side for Twenty20s against Zimbabwe

ఈ ఏడాది వరల్డ్ కప్‌లో ఏమంత గొప్పగా ప్రదర్శనను కనబర్చని మిడల్ ఆర్డర్ బ్యాడ్స్‌మెన్ ఉమర్ అక్మల్‌ని కూడా చోటు కల్పించారు. ఇటీవల పాక్ రంజీల్లో అధ్బుతమైన ప్రదర్శనను కనబరిచిన ఇమ్మద్ వసిం, నోమన్ అన్వర్‌లకు కూడా చోటు దక్కింది.

పాక్‌తో రెండు టీ- 20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడేందుకు మంగళవారం జింబాబ్వే జట్టు లాహోర్‌కు చేరుకుంది. ఆరు సంవత్సరాల తరువాత టెస్ట్ హోదా కలిగిన ఒక క్రికెట్ జట్టు పాక్‌లో అడుగు పెట్టింది. నాలుగు వేల మంది భద్రతా సిబ్బంది జింబాబ్వే క్రికెట్ టీం సభ్యులకు భద్రత కల్పించారు.

English summary
Pakistan cricket selectors on Tuesday recalled fast bowler Mohammad Sami after an absence of almost three years for a two-match Twenty20 series against Zimbabwe.
మీ వ్యాఖ్య రాయండి