Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లా టూర్: ధోనీ, కోహ్లీలకు నో రెస్ట్, భజ్జీకి మళ్లీ పిలుపు, యువీపై నో చర్చ

Posted by:
Updated: Wednesday, May 20, 2015, 14:35 [IST]

ముంబై: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ఎంపిక చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇస్తారని భావించారు. కానీ అలా జరగలేదు. బంగ్లాదేశ్ పర్యటనకు ధోనీనే కెప్టెన్‌గా ప్రకటించారు. కోహ్లీని వైస్ కెప్టెన్‌గా ప్రకటించారు.

బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ మూడు వన్డేలు ఒక టెస్ట్ ఆడనుంది. బంగ్లాదేశ్ పర్యటనలో జరగనున్న టెస్టుకు హర్భజన్ సింగ్ మళ్లీ ఎంపికయ్యాడు. టెస్టుల్లో జడెజాకు చోటు దక్కలేదు. టెస్ట్ జట్టుకు యువరాజ్ ఎంపిక పైన చర్చ జరగలేదని బీసీసీఐ ప్రతినిధి సందీప్ పాటిల్ చెప్పారు. యువరాజ్, సెహ్వాగ్ వంటి దిగ్గజాలు లేకుండానే బంగ్లా టూర్ ఉంటోంది. పాకిస్తాన్ టూర్ పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని సందీప్ పాటిల్ చెప్పారు.

 Harbhajan Singh recalled to India Test squad; ODI team also announced

వన్డే జట్టు

మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఆర్ అశ్విన్, రవీంద్ర జడెజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్ట్రాట్ బిన్నీ, ధావల్ కులకర్ణి

టెస్ట్ జట్టు

కోహ్లీ, మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, విజయ్, రాహుల్, భువనేశ్వర్, ఉమేశ్, అశ్విన్, హర్బజన్, కరణ్ శర్మ, వరుణ్ ఆరోన్, ఇషాంత్ శర్మ.

Story first published:  Wednesday, May 20, 2015, 14:08 [IST]
English summary
Harbhajan Singh was today recalled to the Indian Test squad to play against Bangladesh next month. Virat Kohli will lead the side.
మీ వ్యాఖ్య రాయండి