Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జూ.టెండుల్కర్‌కి అక్రం ఫిదా, ఆ టెక్నిక్ తర్వాత చెప్తా

Posted by:
Published: Wednesday, May 20, 2015, 12:00 [IST]

ముంబై: పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ఇటీవల ముంబైలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండుల్కర్‌కు బౌలింగ్ కిటుకులు నేర్పిన విషయం తెలిసిందే. వాంఖేడే స్టేడియంలో సచిన్ తన తనయుడిని నెట్స్ వద్ద ఉన్న వసీం వద్దకు తీసుకు వచ్చాడు.

అర్జున్ టెండుల్కర్‌కు వసీం అక్రమ్ ఫిట్‌నెస్, బంతి గ్రిప్ పైన పలు సలహాలు ఇచ్చాడు. అర్జున్ టెండుల్కర్ ప్రదర్శన పట్ల వసీమ్ అక్రమ్ ముగ్ధుడయ్యాడు.

Arjun Tendulkar

ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ... అర్జున్ టెండుల్కర్‌లో క్రికెట్ తపన చాలా ఉందన్నాడు. లెఫ్టార్మ పేసర్ అయిన అర్జున్‌లో చాలా టాలెంట్ ఉందని చెప్పాడు. మణికట్టును ఉపయోగించడంపై అతడికి పలు సలహాలు ఇచ్చానని తెలిపాడు.

ముఖ్యంగా కుడిచేతివాటం ఆటగాడికి బౌలింగ్ చేస్తున్నప్పుడు బంతిని లోపలకు స్వింగ్ చేయడం ఎలాగో చెప్పానని తెలిపాడు. ఈ టెక్నిక్‌కు మూడు నెలల పాటు ప్రాక్టీస్ చేయమని చెప్పానని, దానిని సాధన చేశాక, కుడిచేతి వాటం ఆటగాళ్లకు బౌలింగ్ చేస్తున్నప్పుడు అవుట్ స్వింగ్ రాబట్టడం నేర్పిస్తానని చెప్పాడు.

English summary
I showed Arjun Tendulkar how to bring the ball back into right-hander: Wasim Akram
మీ వ్యాఖ్య రాయండి