Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

గత రెండేళ్లలో బీసీసీఐ 'లీగల్' ఖర్చులు 56 కోట్లు

Posted by:
Published: Friday, May 22, 2015, 12:12 [IST]

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ధనికి బోర్డుగా పేరున్న బీసీసీఐ గత రెండేళ్లలో న్యాయ సంబంధ విషయాల కోసం ఏకంగా రూ. 56 కోట్లు ఖర్చు పెట్టింది. గురువారం జరిగిన బోర్డు ఆర్ధిక సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

గురువారం న్యూఢిల్లీ సమావేశమైన బోర్డు గత రెండేళ్లలో న్యాయ సంబంధ ఖర్చులు భారీగా పెరగడంతో రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు ఇచ్చే మౌళిక రాయితీలను రూ. 50 కోట్ల నుంచి రూ. 75 కోట్లకు పెంచాలన్న ప్రతిపాదనను జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని ఆర్థిక కమిటీ తిరస్కరించింది.

BCCI

గత రెండేళ్లలో బీసీసీఐ న్యాయ సంబంధ ఖర్చులు రూ. 31 కోట్లు, రూ. 25 కోట్లుగా ఉన్నాయి. దీంతో రాయితీలను ఇప్పుడే పెంచలేమని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుధ్ చౌదరి వెల్లడించారు. నిధులను ఏవిధంగా వినియోగించారో దానికి సంబంధించిన గైడ్‌లైన్‌ని కూడా రూపొందిస్తామన్నారు.

ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును విచారించిన జస్టిస్‌ ముద్గల్‌ కమిటీకి బీసీసీఐ రూ. 1.5 కోట్లు చెల్లించింది. ఇక, సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్‌ ఆర్‌ఎమ్‌ లోథా కమిటీకి బీసీసీఐ అప్పటికే రూ. 3.90 కోట్లు ఖర్చు చేసిందని ఆర్ధిక సంఘం సభ్యుడొకరు వెల్లడించారు.

దీంతో పాటు మిథాల్ రాజ్, జులన్ గోస్వామి వంటి క్రీడాకారిణులను గ్రేడింగ్ పే విధానంలోకి తీసుకున్నట్లు ఆర్ధిక సంఘం సభ్యుడొకరు తెలిపారు.

English summary
The Board of Control for Cricket in India (BCCI) expenditure on legal matters in the last two years went up to Rs 56 crore, it was disclosed at its finance committee meeting at New Delhi on Thursday.
మీ వ్యాఖ్య రాయండి