Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బోల్డ్‌ను దాటాడు: ప్రపంచఅథ్లెట్లలో కోహ్లీకి ఆరోస్థానం

Posted by:
Published: Friday, May 22, 2015, 12:04 [IST]

లండన్: వాణిజ్యపరంగా అత్యధిక ప్రాచుర్యమున్న క్రీడాకారుల జాబితాలో భారత స్టార్‌ క్రికెటర్‌ కోహ్లికి ఆరో స్థానం దక్కింది. స్పోర్ట్స్‌ ప్రో అనే బ్రిటన్‌ స్పోర్ట్స్ బిజినెస్ పత్రిక ప్రకటించిన ఈ జాబితాను విడుదల చేసింది.

 Virat Kohli named sixth most marketable athlete by British magazine

ఇందులో ప్రఖ్యాత అథ్లెట్‌ ఉసెన్‌ బోల్ట్‌ (10), టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ (14), ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు లియోనెల్‌ మెస్సీ (16), క్రిస్టియానో రొనాల్డో (22)లను కూడా కోహ్లి దాటేశాడు.

భారత బ్యాడ్మింటన్‌ తార సైనా నెహ్వాల్‌ 44వ స్థానంలో నిలిచింది. కెనడా టెన్నిస్‌ యువ తార బౌచర్డ్‌ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది. బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు నెయ్‌మార్‌, అమెరికా గోల్ఫర్‌ జోర్డాన్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

English summary
British Sports business magazine 'SportsPro' has named Indian Test cricket captain Virat Kohli as the sixth most marketable athlete of this year ahead of the likes of sprint king Usain Bolt and football superstars Lionel Messi and Cristiano Ronaldo.
మీ వ్యాఖ్య రాయండి