Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లా టూర్: హై పెర్ఫామెన్స్‌ మేనేజర్‌గా గంగూలీ..?

Posted by:
Published: Monday, May 25, 2015, 12:20 [IST]

కోల్‌కత్తా: టీమిండియాకు ఎన్నో విజయాలను అందించిన మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీని భారత జట్టుకు హై పెర్ఫామెన్స్‌ మేనేజర్‌గా నియమించే అవకాశం ఉంది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న గంగూలీ ఒప్పందం మేరకు వచ్చే నెలలో బంగ్లా పర్యటనకు భారత జట్టు వెంట వెళ్లనున్నాడు.

ఈ కొత్త పదవి నియమ నిబంధనల గురించి సోమవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలో జరగనున్న బంగ్లా పర్యనట సందర్భంగా జట్టు సహాయ సిబ్బంది విషయమై బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియాతో, బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ సోమవారం చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Ganguly likely to be appointed high performance manager

గంగూలీని హై పెర్ఫామెన్స్‌ మేనేజర్‌గా నియమిస్తే, ప్రస్తుతం సహాయక కోచ్‌లుగా ఉన్న సంజయ్ బంగర్, భరత్‌ అరుణ్‌ల భవితవ్యం గురించి తేలాల్సి ఉంది. ఆదివారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కోల్‌కత్తాలో జరిగింది. ఈ సమావేశంలో ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 స్థానంలో కొత్త టి20 ఈవెంట్‌ను ప్రవేశపెట్టేందుకు బోర్డు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించి ఆస్టేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులతో ఆదివారం జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్లేఆఫ్‌లో ఆడిన నాలుగు జట్లతో సెప్టెంబర్‌లో యూఏఈలో టోర్నీ నిర్వహించే అవకాశాలున్నాయి.

English summary
The Board of Control for Cricket in India (BCCI) gripped by inertia since the new set of office-bearers assumed office during the AGM on March 2nd, will look to get some business transacted over the next two days. With a host of officials and Board members invited to attend Sunday's IPL final at the Eden Gardens, the BCCI has lined up a series of meetings.
మీ వ్యాఖ్య రాయండి