Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫ్యాన్స్‌పై సచిన్, ముంబై విజయం వెనుక..

Posted by:
Updated: Monday, May 25, 2015, 13:46 [IST]

కోల్‌కతా: ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులతో అనుబంధాన్ని ఆస్వాదించానని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆదివారం అన్నాడు. అందరం కలిసి ప్రయాణించామని, ఐపీఎల్ 8 కోసం కష్టపడ్డామని చెప్పాడు. తామంతా ప్రణాళిక ప్రకారం నడుచుకున్నామని తెలిపాడు.

కష్ట సమయాల్లో కలిసికట్టుగా ఉండటం వల్లే ఐపీఎల్ 8లో ట్రోఫీని దక్కించుకున్నామని చెప్పాడు. సిమన్స్ రోహిత్ శర్మలు ఆదివారం ఉదయం మంచి ఆరంభాన్ని ఇచ్చారని కితాబిచ్చాడు. ఎల్లప్పుడూ తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా కష్టమేనని అన్నాడు.

 Staying together in tough times is key to Mumbai Indians' success: Sachin Tendulkar

కాగా, ఐపీఎల్ 8 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ పైన ముంబై ఇండియన్స్ 41 పరుగుల తేడాతో గెలిచి టైటిల్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబాని, ఆయన తనయులు, సచిన్ టెండుల్కర్, ఆయన భార్య అంజలి, కూతురు సారా తదితరులు వీక్షించారు. ముంబై జట్టుకు చీర్స్ చెప్పారు.

Story first published:  Monday, May 25, 2015, 12:27 [IST]
English summary
An elated Mumbai Indians' mentor Sachin Tendulkar said that staying together in adverse situation has been key ingredient to their franchise's success in the Indian Premier League cricket tournament.
మీ వ్యాఖ్య రాయండి