Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రోహిత్ శర్మనే బెస్ట్: సచిన్, మరో కెప్టెన్ దొరికాడు

Posted by:
Published: Tuesday, May 26, 2015, 14:14 [IST]

ముంబై: భారత క్రికెట్‌కు మరో సారథి దొరికాడా? అంటే అవుననే అంటున్నారు. ఐపీఎల్ 8లో ముంబై ఇండియన్స్‌కు టైటిల్ సాధించిపెట్టిన సారథి రోహిత్ శర్మ రూపంలో మరొక కెప్టెన్ దొరికాడని అంటున్నారు. ఐపీఎల్ ఆరంభంలో పరాజయాల బాటన ఉన్నప్పటికీ ఆ తర్వాత ముంబై పుంజుకొని టైటిల్ గెలిచింది. కెప్టెన్‌గా, ఓ జట్టు సభ్యుడిగా రోహిత్ శర్మ విజయవంతమయ్యాడు.

రోహీత్ ఈ సీజన్‌లో టోర్నీలో 16 మ్యాచ్‌ల్లో 34.42 సగటు, 144.74 స్ట్రైక్ రేట్‌తో అతను 482 పరుగులు చేశాడు. అదే సమయంలో జట్టు కోసం వివిధ పాత్రలు పోషించాడు. ఓపెనర్‌, వన్‌డౌన్‌, నాలుగో స్థానం.. ఇలా అవసరానికి తగ్గట్టు జట్టుకి ఉపయోగపడ్డాడు.

rohit sharma

2013లో రికీ పాంటింగ్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో రోహిత్‌ పగ్గాలు చేపట్టాడు. ఈ దశలో అందివచ్చిన అవకాశాన్ని రోహిత్‌ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. నాయకుడిగా రోహిత్‌ అందరి మనసులూ గెలిచాడు.

రోహిత్‌ ముఖ్యంగా దిగ్గజ ఆటగాళ్లు సచిన్‌, పాంటింగ్‌లను ఆకట్టుకున్నాడు. ఆ ఇద్దరూ ముంబై జట్టుతో ఉన్నప్పటికీ ఇక్కడ ఆ విషయం అప్రస్తుతమని చెప్చొచ్చు. ప్రస్తుతం రోహిత్ శర్మ బెస్ట్ కెప్టెన్ అన్నాడు.

కెప్టెన్‌గా రోహిత్‌లో ఎంతో మార్పొచ్చిందని, అతనిప్పుడు మంచి నాయకుడని సచిన్‌ కితాబిచ్చాడు. ముంబై నాయకుడిగా అనేక ఎత్తుపల్లాలు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా తయారయ్యాడని పేర్కొన్నాడు. మైదానంలో వ్యూహాలను రోహిత్‌ సమర్థవంతంగా అమలు చేస్తాడన్నాడు.

ఇక రోహిత్‌లో ఉన్న నైపుణ్యాలే అతడిని మంచి స్థానంలో నిలబెట్టాయని రికీ పాంటింగ్‌ పేర్కొన్నాడు. అతనికి టీమిండియా సారథ్య బాధ్యతలు అప్పగించొచ్చని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో, ముఖ్యంగా చివరి దశలో రోహిత్‌ అద్భుతంగా పుంజుకోవడం చూడవచ్చునని, అతను కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడన్నాడు.

ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 8లో నిజమైన ఛాంపియన్లుగా ఆడిందని రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్ లీగ్‌లో ప్రతి మ్యాచ్‌ను తాము ఫైనల్ గానే చూశాని చెప్పాడు.

English summary
Mumbai Indians Mentor Sachin Tendulkar Says Rohit Sharma a Better Captain Now
మీ వ్యాఖ్య రాయండి