Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వన్డే, టెస్ట్, ఐపీఎల్: రోహిత్‌కు ఈడెన్ ఎంతో ప్రత్యేకం

Posted by:
Published: Tuesday, May 26, 2015, 13:40 [IST]

కోల్‌కతా: ఐపీఎల్ 8 టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు సోమవారం రాత్రి ముంబైలోని వాంఖేడే స్టేడియంలో సంబరాలు చేసుకుంది. అనంతరం ఆటగాళ్లకు యజమాని నీతా అంబానీ తన ఇంట్లో ప్రయివేటుగా పార్టీని ఇచ్చారు.

ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ముంబై కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సంబరాలు చేసుకుంది. సోమవారం సొంత మైదానం వాంఖేడేలో చేసుకుంది. వాంఖడేలో అభిమానుల సమక్షంలో ఆటగాళ్లు ఐపీఎల్‌ విజయాన్ని ఆస్వాదించారు.

రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టుతో పాటు టీమ్‌ మెంటార్ సచిన్‌ టెండుల్కర్, సహాయక సిబ్బంది పాంటింగ్‌, జాన్‌ రైట్‌, జాంటీ రోడ్స్‌, కుంబ్లే, రాబిన్‌ సింగ్‌, షేన్‌ బాండ్‌, జట్టు యజమాని నీతా అంబాని మైదానంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు.

ఆటగాళ్లు హర్భజన్‌ సింగ్‌, మలింగ, పార్థివ్‌ పటేల్‌, పొలార్డ్‌, అంబటి రాయుడు ఐపీఎల్‌ ట్రోఫీ చేతబూని ఫొటోలు దిగారు. కోల్‌కతాలో ఫైనల్‌ గెలిచాక అభిమానులు వాంఖడే స్టేడియానికి వచ్చి గెలుపు సంబరాల్లో పాల్గొనాలని ముంబయి జట్టు ఆహ్వానించింది.

Test debut 100, ODI double ton, 2 IPL titles: Is Rohit Sharma Eden Garden's latest favourite?

ఇలాంటి క్షణాలు జీవితంలో కొన్నిసార్లే వస్తాయని, అభిమానుల మధ్యలో ఇలా గెలుపు సంబరాలు చేసుకోవడం మరింత ఆనందంగా ఉందని, మద్దతుగా నిలిచిన అందరికీ తన కృతజ్ఞతలని సచిన్‌ పేర్కొన్నాడు. కెరీర్‌ వాంఖడేలోనే మొదలుపెట్టానని, అన్ని మైదానాల్లోకెల్లా ఇది ప్రత్యేకమైందని, ఈ ట్రోఫీ మద్దతుగా నిలిచిన అభిమానులందరిదని రోహిత్‌ అన్నాడు.

రోహిత్ శర్మకు ఈడెన్ ప్రత్యేకమైనది

రోహిత్ శర్మకు ఈడెన్ గార్జెన్ ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఇదే మైదానంలో అతను ముంబై జట్టుకు రెండో ఐపీఎల్ టైటిల్ అందించాడు. ఐపీఎల్ 8 ఫైనల్లో 26 బంతుల్లో 50 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

అంతకుముందు ఇదే మైదానంలో.. గత ఏడాది నవంబర్ నెలలో శ్రీలంక పైన ఆడిన వన్డేలో రోహిత్ 225 బంతుల్లో 264 పరుగులు చేశాడు. 2013లో తన తొలి టెస్టులో వెస్టిండీస్ పైన ఇదే మైదానంలో 177 పరుగులు చేయడం గమనార్హం.

English summary
The Mumbai Indians (MI) players, franchise members and supporters celebrated the team's second Indian Premier League (IPL) title at the Wankhede Stadium here on Monday night. The team was facilitated at the stadium and then the Ambanis, owner of the party, threw a private dinner party for the players at their residence.
మీ వ్యాఖ్య రాయండి