Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

యాషెస్: ఇంగ్లండ్ కొత్త కోచ్‌గా ట్రెవర్ బేలిస్ ఎంపిక

Posted by:
Published: Wednesday, May 27, 2015, 13:10 [IST]

ఇంగ్లాండ్ క్రికెట్ కొత్త కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్ బేలిస్ ఎంపికయ్యాడు. కోచ్ పదవి నుంచి మోరెస్‌ను తప్పించిన నేపథ్యంలో 52 ఏండ్ల ట్రెవర్‌ను నూతన కోచ్‌గా నియమిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది.

ట్రెవర్ బేలిస్ తన దేశానికే చెందిన జేసన్ గిలెస్పీతో పోటీలో గెలిచి ఇంగ్లాండ్ కోచ్ పదవికి ఎంపికయ్యాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. ట్రెవర్ బేలిస్ శిక్షణలోనే శ్రీలంక 2011లో వరల్డ్ కప్ పైనల్‌కు చేరింది. టెస్టుల్లో రెండో ర్యాంకుకు చేరింది.

England lucky to have Trevor Bayliss as their coach, Aus coach Lehmann says ahead of Ashes

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు ట్రెవర్ బేలిస్ కోచ్‌గా ఉన్నాడు. వీటితో పాటు న్యూసౌత్‌వేల్స్, సిడ్నీ సిక్సర్స్ లాంటి జట్లకు ఎన్నో అపూరూపమైన విజయాలను అందించాడు. జులైలో యాషెస్ సిరీస్‌తో ఇంగ్లండ్ కోచింగ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

యాషెస్ సిరిస్‌లో భాగంగా ఆస్టేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు జులై 8 నుంచి ప్రారంభం కానుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో విజయం సాధించి ఇంగ్లాండ్ మంచి ఫామ్‌లో ఉంది. ఇంగ్లాండ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్‌ను ఎంపిక చేయడాన్ని ఆస్టేలియా కోచ్ డారెన్ లీమన్, మాజీ ఫేసర్ బ్రెట్ లీ కొనియాడారు.

English summary
Australian cricket coach Darren Lehmann said on Wednesday that the appointment of Trevor Bayliss, also an Australian, as the new coach of the English cricket team will make Australia's task of winning the Ashes harder.
మీ వ్యాఖ్య రాయండి