Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వైఫల్యాలనే ఎక్కువగా, యువీ షాట్‌కు ఫిదా: ధావన్

Posted by:
Updated: Wednesday, May 27, 2015, 8:35 [IST]

న్యూఢిల్లీ: తాను విజయాల కన్నా వైఫల్యాలనే ఎక్కువగా చూశానని భారత క్రికెటర్ శిఖర్ ధావన్ అన్నాడు. తానిప్పుడు విజయవంతమైన క్రికెటర్‌గా కనిపిస్తున్నప్పటికీ కెరీర్‌లో విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువగా పలకరించాయని ఆయన అన్నాడు. అనివార్యంగా ఎదురైన వైఫల్యాలను ఎదుర్కొనే సామర్థ్యం తన ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో ఎంత గానో ఉపయోగపడిందని చెబుతున్నాడు.

తనను ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గా చూస్తున్నారు గానీ తన కెరీర్‌లో సక్సెస్‌ కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ అని ఆయన అన్నాడు. అరవై వన్డేలు ఆడినా ఎనిమిది సెంచరీలే చేశానని, చాలా మంది ఫామ్‌ గురించి ఆందోళన చెందుతారని, తన వరకైతే అది నిరంతరం కొనసాగే ప్రకియ అని అతను చెప్పాడు. ఇక త్వరలో జరిగే బంగ్లాదేశ్‌ సిరీస్‌ గురించి అతిగా ఆలోచించడం లేదన్నాడు.

I have experienced more failure than success: Shikhar Dhawan

కొన్ని విషయాల్లో యువరాజ్‌, చటేశ్వర్‌ పుజారాను చూసి స్ఫూర్తిపొందానని చెప్పాడు. యువరాజ్‌ పాజీ బంతిని కొట్టే విధానం చాలా స్వీట్‌గా ఉంటుందని, మరొకరు అలా కొట్టలేరని, దాన్ని చూసి తాను స్ఫూర్తి పొందనని చెప్పాడు అంతర్జాతీయ క్రికెట్‌లో విజయం సాధించాలంటే అతనిలా ఆడాలని గ్రహించానని, ఇక నిలకడ గురించి పుజారా నుంచి నేర్చుకున్నానని ధావన్‌ అన్నాడు.

స్మైల్ ఫౌండేషన్ కార్యక్రమంలో పిల్లలతో గడిపిన సందర్భంగా ఆయన మాట్లాడాడు. అంతర్గతంగా ఏదో శక్తి తనపై పని చేస్తూ ఉందని, అందుకే వైఫల్యాలను ఎదుర్కునే శక్తి ఒనగూరిందని దావన్ అన్నాడు. ఫిట్నెస్‌పై ఎప్పుడూ శ్రద్ధ చూపాల్సిందేనని, బంగ్లాదేశ్ పర్యటన కోసం తాను ప్రత్యేకంగా ఏమీ సన్నాహాలు చేసుకోవడం లేదని చెప్పాడు.

Story first published:  Wednesday, May 27, 2015, 8:27 [IST]
English summary
India opening batsman Shikhar Dhawan says his ability to deal with the "inevitable failure" has helped him immensely in his five-year-old international career.
మీ వ్యాఖ్య రాయండి