Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

విండీస్ క్రికెట్లో వివాదం: ఒక్కసారి ప్లీజ్, బోర్డు నో

Posted by:
Published: Thursday, May 28, 2015, 12:49 [IST]

గయానా: తాను మరీ మరీ అవకాశం కోసం ఏమీ అడగటం లేదని వెస్టిండీస్ క్రికెటర్ చందర్ పాల్ గురువారం నాడు చెప్పాడు. తన కెరీర్‌ను వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఇలా ముగించడం తనను అసంతృప్తికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

వెస్టిండీస్‌ క్రికెట్లో మరో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో తనకు అవకాశమిస్తే గౌరవంగా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతానని అతడు కోరాడు. దానిని బోర్డు వినిపించుకోలేదు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు వెస్టిండీస్‌ జట్టును ఈ నెల 29న ఎంపిక చేయనున్నారు.

ఐతే సిరీస్‌ ముందు శిక్షణ శిబిరానికి పిలిచిన 12 మంది సభ్యుల్లో 42 ఏళ్ల చందర్‌పాల్‌ లేడు. ఈ నేపథ్యంలో కోచ్‌ ఫిల్‌ సిమన్స్‌, చందర్ పాల్ మధ్య వాట్సప్‌లో మాటల యుద్ధం సాగింది.

Chanderpaul: I'm not asking for too much

వీడ్కోలుపై తుది నిర్ణయం తనదేనని, ఇంతకుముందు మీరన్నారని, ఆస్ట్రేలియాతో సిరీస్‌కు తాను అందుబాటులో ఉన్నానని, సొంత ప్రేక్షకుల ముందు వీడ్కోలు పలికే అవకాశం కల్పించాలని, కరీబియన్‌ క్రికెట్‌కు 21 ఏళ్లు చేసిన సేవలను గుర్తించేందుకు విండీస్‌ బోర్డుకు ఇది చక్కటి అవకాశమని సిమన్స్‌కు వాట్సప్‌లో సందేశం పంపాడు.

దానికి, తన చేతుల్లో ఏమీ లేదని సిమన్స్‌ స్పందించాడు. చందర్ పాల్ తానే ఎక్కువగా కోరుకోవట్లేదని, బలవంతంగా రిటైరయ్యేలా చేయవద్దని, కనీసం అభిమానుల అభిప్రాయానైన్నా పరిగణనలోకి తీసుకుని, చివరి సిరీస్‌ ఆడే అవకాశమివ్వాలన్నాడు.

ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికాలతో మూడేసి మ్యాచ్‌ల్లో 11 ఇన్నింగ్స్‌ ఆడి 16.64 సగటుతో 183 పరుగులే చేశావని, భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కుర్రాళ్లకు అవకాశమివ్వాలని సెలెక్టర్లు నిర్ణయిచారని, వెస్టిండీస్‌ క్రికెట్‌కు సుదీర్ఘ కాలం సేవలందించినందుకు కృతజ్ఞతలని చందర్‌పాల్‌కు రాసిన లేఖలో సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ క్లీవ్ లాయిడ్‌ పేర్కొన్నాడు.

English summary
Shivnarine Chanderpaul, on Thursday, said he is disappointed with the manner in which his career as a West Indies cricketer has come to an end but insists that he has not yet retired from the game.
మీ వ్యాఖ్య రాయండి