Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నితిన్ రాజీనామాతో ఫిజియో వేటలో బీసీసీఐ..!

Posted by:
Published: Friday, May 29, 2015, 12:56 [IST]

బెంగుళూరు: టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరిని ఎంపిక చేయాలని బీసీసీఐ సతమతమవుతుంటే, తాజాగా మరో కొత్త సమస్య వచ్చింది. భారత క్రికెట్ జట్టుకు సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఫిజియో నితిన్ పటేల్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు.

కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే నితిన్ రాజీనామాను బీసీసీఐ ఇంకా ఆమోదించలేదు. 2007 ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా జాన్ గ్లోస్టర్ స్థానంలో నితిన్‌ను ఫిజియోగా బీసీసీఐ నియమించింది. విదేశీ పర్యటనలకు టీమిండియా వెంట ప్రయాణించడంతో పాటు బెంగళూరులోని ఎన్‌సీఏలో నితిన్ పటేల్ సేవలందించాడు.

BCCI in search of physio Nitin Patel's replacement: Report

నితిన్ పటేల్ రాజీనామాతో ఖాళీ ఆయిన ఫిజయో పదవికి కొత్త ఫిజియోని వెతికే పనిలో బీసీసీఐ పడింది. ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికాల్లో తగిన వ్యక్తుల కోసం బోర్డు వెతుకుతుంది. అయితే ఈ పదవికి సిడ్నీకి చెందిన ప్యాట్రిక్‌ ఫర్హాత్‌ తగిన వ్యక్తిగా బోర్డు భావిస్తోంది.

50 ఏళ్ల ప్యాట్రిక్‌ ఫర్హాత్‌ ప్రపంచ వ్యాప్తంగా పలు క్రికెట్ జట్లకు ఫజియోగా పని చేయడంతో పాటు, ఆస్టేలియాలోని పుట్‌బాల్, రగ్భీ జట్లకు ఫిజియోగా పని చేసిన అనుభవం కలిగి ఉన్నాడు. ప్యాట్రిక్‌ ఫర్హాత్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, మంబై ఇండియన్స్ జట్లకు ఫిజియోగా వ్వవహరించాడు.

English summary
The Board of Control for Cricket in India (BCCI), besides engaging in a serious task of finding Team India's next coach, is also looking for a replacement for Nitin Patel, the long-serving team physio who resigned recently citing personal reasons, a Bangalore Mirror report said.
మీ వ్యాఖ్య రాయండి