Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అవి ధోనీ నుంచి నేర్చుకో: కోహ్లీకి కపిల్ సూచన

Published: Saturday, May 30, 2015, 15:14 [IST]

న్యూఢిల్లీ: భారత యువ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. భారత వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోని నుంచి కెప్టెన్సీ సుగుణాలను అలవరుచుకోవాలని మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ సూచించాడు. 'కోహ్లి మైదానంలో చాలా దూకుడుగా ఉంటాడు. ధోనీలా కాకుండా అతనిలో భావోద్వేగాలు స్పష్టంగా తెలిసిపోతుంటాయి' అని చెప్పాడు.

ఇంకా చెబుతూ ‘క్రికెట్లో పరిణతి చాలా చాలా ముఖ్యం. ధోనీ కూడా తప్పులు చేసి ఉంటాడు. కానీ వేగంగా నేర్చుకున్నాడు. నేను కూడా చాలా తప్పులు చేసినా దిద్దుకున్నా. వేగంగా నేర్చుకోవడం సారథి లక్షణం. కెప్టెన్‌గా నీ సొంత ప్రదర్శన కన్నా జట్టు రాణించడం కీలకం. ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. భిన్నంగా ఆలోచిస్తారు' అని కపిల్‌ పేర్కొన్నాడు.

నేల మీదే ఉన్నా: సర్ఫరాజ్ ఖాన్

Kapil Dev urges Virat Kohli to learn from MS Dhoni's captaincy qualities

లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్-8 ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని.. స్టార్‌ ఆటగాళ్లతో ఆడినా తన కాళ్లు నేల మీదే ఉన్నాయని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాట్స్‌మన్‌ సర్ఫరాజ్‌ఖాన్‌ తెలిపాడు.

'గేల్‌, కోహ్లీ, డివిలియర్స్‌ తర్వాత ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం పెద్ద గౌరవం. తీవ్ర ఒత్తిడి ఉండే ఆ స్థానంలో సీనియర్లు, అనుభవజ్ఞులు మాత్రమే ఆడతారు. అలాంటి స్థానంలో బ్యాటింగ్‌కు రావడం నా అదృష్టం' పేర్కొన్నాడు.

‘కోహ్లీ ఎంతో సాయం చేశాడు. కెప్టెన్‌, మార్గదర్శిగా మాత్రమే కాదు, స్నేహితుడిగా సలహాలిచ్చాడు. ఇదెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. అయినా నా కాళ్లు భూమి మీదే ఉన్నాయి. ఈ విశ్వాసంతో ముందుకు సాగుతాను. త్వరలోనే భారత్‌కు ఆడతాననే నమ్మకముంది' అని సర్ఫరాజ్‌ తెలిపాడు.

English summary
Legendary Indian all-rounder Kapil Dev has urged current Indian Test captain Virat Kohli to learn from MS Dhoni’s qualities as he prepares to lead India for the one-off Test match against Bangladesh.
మీ వ్యాఖ్య రాయండి