Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

400 వికెట్ల క్లబ్‌లో ఇంగ్లాండ్ బౌలర్ ఆండర్సన్

Posted by:
Published: Sunday, May 31, 2015, 10:57 [IST]

లీడ్స్: జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో 400 వికెట్లు సాధించిన తొలి ఇంగ్లాండ్ బౌలర్‌గా రికార్డు సాధించాడు. మొత్తంగా ఈ రికార్డు సాధించిన 12వ బౌలర్‌గానూ, 8వ పేసర్‌గా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఓపెనర్ గుప్తిల్‌ను అవుట్ చేయడం ద్వారా ఆండర్సన్ ఈ రికార్డుని సాధించాడు.

32 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ తన 104వ టెస్టులో ఈ ఘనతను అందుకున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్స్‌లో ఆండర్సన్‌కు ముందు ఇయాన్ బోథమ్ 383 వికెట్లు తీసుకోని అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా ఉన్నారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 800 వికెట్లు తీసుకొని ముత్తయ్య మురళీధరన్ నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నారు.

James Anderson becomes 12th member of 400 club: Here is the full list

టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు:

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) - 800 వికెట్లు (133 మ్యాచ్‌లు)

షేన్ వాట్సన్ (ఆస్టేలియా) - 708 వికెట్లు (145 మ్యాచ్‌లు)

గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్టేలియా) - 619 వికెట్లు (563 మ్యాచ్‌లు)

కోట్నీ వాల్స్ (వెస్టిండిస్) - 519 వికెట్లు (132 మ్యాచ్‌లు)

కపిల్ దేవ్ (ఇండియా) - 434 వికెట్లు (131 మ్యాచ్‌లు)

సర్ రిచర్డ్ హ్యాడ్లీ (న్యూజిలాండ్) - 431 వికెట్లు (86 మ్యాచ్‌లు)

షాన్ పొల్లాక్ (దక్షిణాఫ్రికా) - 421 వికెట్లు (108 మ్యాచ్‌లు)

వసీం అక్రమ్ (పాకిస్ధాన్) - 414 వికెట్లు (104 మ్యాచ్‌లు)

హర్భజన్ సింగ్ (ఇండియా) - 413 వికెట్లు (104 మ్యాచ్‌లు)

ఆంబ్రోస్ (వెస్టిండిస్) - 405 వికెట్లు (101 మ్యాచ్‌లు)

జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) - 401 వికెట్లు (104 మ్యాచ్‌లు)

English summary
James Anderson created history at Headingley on Friday when he became the first English bowler to take 400 wickets in Tests. His record came in the fifth over of the second Test against New Zealand when he dismissed opener Martin Guptill for nought. Ian Botham with the 383 wickets was the highest before Anderson overtook him.
మీ వ్యాఖ్య రాయండి