Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వరల్డ్ క్రికెట్ పాక్‌కు మద్దతుగా నిలవాలి: మిస్బా

Posted by:
Published: Monday, June 1, 2015, 12:04 [IST]

కరాచీ: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం పాక్‌కు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని పాక్ క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్ మిస్బా వుల్ హక్ అన్నాడు. జింబాబ్వే జట్టుతో పాక్ ఆడిన సిరిస్ విజయవంతంగా ముగిసిందని పేర్కొన్నాడు.

ఈ సిరిస్ ద్వారా ప్రపంచంలోని మిగతా దేశాలకు గట్టి సందేశం వెళ్లిందని అన్నాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు ప్రపంచంలోని మిగతా దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశాడు.

Misbah-ul-Haq

బయట జరుగుతున్న పరిణామాలను పట్టించుకోకుండా అభిమానులు క్రికెట్‌ను గతంలో మాదిరి ఆదరించడం తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నాడు. పాక్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా దేశాలు చొరవ చూపాలని సూచించారు.

ఆరు సంవత్సరాల తర్వాత పాకిస్ధాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు జింబాబ్వే ఆ దేశ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. పాక్, జింబాబ్వే జట్లు ఒక టెస్టు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడాయి. లాహోర్‌లోని గడాఫీ స్డేడియంలో జరగాల్సిన మూడవ వన్డే వర్షం కారణంగా రద్దయింది.

English summary
Elated by the successful completion of their first home series in over six years, Pakistan's Test captain Misbah-ul-Haq said rest of the cricket-playing world should also come forward to support his country now.
మీ వ్యాఖ్య రాయండి