Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇండో-పాక్ సిరిస్: 'నిర్ణయం తీసుకోలేదు'

Posted by:
Published: Monday, June 1, 2015, 9:43 [IST]

న్యూఢిల్లీ: ఇండో-పాక్ సిరిస్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలదేని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆదివారం తెలిపారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌, ఈ ఏడాది డిసెంబర్‌లో యూఏఈలో భారత్, పాక్‌ల మధ్య మూడు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20లు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని కోల్‌కతాలో బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియాతో కలిసిన అనంతరం మీడియాతో తెలిపారు.

అయితే, ఈ సిరిస్‌పై బీసీసీఐ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మాట్లాడిన సుష్మ స్వరాజ్ ‘ఇండో-పాక్‌ సిరీస్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీని గురించి నన్నెవరూ సంప్రదించలేద'ని చెప్పారు.

Sushma Swaraj

2008లో ముంబైలో తీవ్రవాదుల దాడి అనంతరం పాకిస్థాన్‌తో భారత్‌ ఇప్పటివరకు ఒక్క దైపాక్షిక టెస్ట్‌ సిరీస్‌ కూడా ఆడలేదు. భారత్‌ చివరగా స్వదేశంలో పాకిస్ధాన్‌తో 2012 డిసెంబర్‌లో మూడు వన్డేలు, రెండు టీ20 సిరీస్‌లో ఆడింది.

ఐసీసీ అధికారికంగా నిర్వహిస్తోన్న టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే ఇరుజట్లూ తలపడుతున్నాయి. ఆరు సంవత్సరాల తర్వాత పాకిస్ధాన్‌లో వన్డే సిరిస్ ఆడేందుకు ఇటీవలే జింబాబ్వే జట్టు ఆ దేశంలో పర్యటించింది.

English summary
No decision has yet been taken on Indo-Pak cricket series, external affairs minister Sushma Swaraj said on Sunday.
మీ వ్యాఖ్య రాయండి