Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

'త్రయం'లో ఒకరు బంగ్లాకు: కోల్‌కత్తాలో సమావేశం

Posted by:
Updated: Tuesday, June 2, 2015, 10:12 [IST]

కోల్‌కత్తా: బీసీసీఐ అడ్వైజరీ కమిటీ ప్యానెల్‌లో సభ్యులుగా నియమితులైన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, లక్ష్మణ్‌లు జూన్ 4, 5వ తారీఖుల్లో కోల్‌కత్తాలో సమావేశమయ్యే కానున్నారు. జూన్ 7న టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురూ బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, సెక్రటరీ అనురాగ్ ఠాకూర్‌లను కలిసి బంగ్లా పర్యటనపై చర్చిస్తారు.

BCCI advisors Tendulkar, Ganguly and Laxman to meet in Kolkata this week

ఈ సమావేశంలో బంగ్లా పర్యటనకు వెళుతోన్న టీమిండియా జట్టుతో పాటు టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి బాధ్యతల నుంచి తప్పుకుంటే, ఈ ముగ్గురిలో ఒకరు జట్టు వెంట బంగ్లా పర్యటనకు వెళ్లే అంశంపై చర్చించనున్నారు. ప్రస్తుతం సౌరభ్ గంగూలీ క్రికెట్ ఆసోసియేషన్ ఆప్ బెంగాల్ (క్యాబ్)కు సెక్రటరీగా ఉన్నారు. క్యాబ్ విజన్ 2020 ప్రాజెక్టులో సభ్యుడిగా వీవీఎస్ లక్ష్మణ్‌ ఉన్న విషయం తెలిసిందే.

క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌లకు సముచిత స్థానం కల్పిస్తూ.. కొత్తగా ఏర్పాటు చేసిన అడ్వైజరీ కమిటీలో సభ్యులుగా నియమిస్తున్నట్లు సోమవారం బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా సచిన్‌, లక్ష్మణ్‌, గంగూలీని బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా ఎంపిక చేశారు. వీరి నియామకం తక్షణం అమల్లోకి వస్తుంద'ని బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

Story first published:  Tuesday, June 2, 2015, 10:11 [IST]
English summary
The newly appointed cricket advisory panel comprising Sachin Tendulkar, Sourav Ganguly and VVS Laxman will have its first meeting in Kolkata with president Jagmohan Dalmiya and secretary Anurag Thakur before the Indian team departs for Bangladesh.
మీ వ్యాఖ్య రాయండి