Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆయన జట్టుకు బలం: శాస్త్రిపై కోహ్లీ ప్రశంసలు

Published: Tuesday, June 2, 2015, 17:36 [IST]

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రిని కొనసాగిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) ప్రకటించడం సరైన నిర్ణయమని భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. రవిశాస్త్రి జట్టులో ఆత్మ విశ్వాసాన్ని నింపుతాడని పేర్కొన్నాడు.

బాధ్యతల నుంచి తప్పుకునే వ్యక్తి కాదని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి అని రవిశాస్త్రిని కొనియాడాడు. రవిశాస్త్రి ముక్కు సూటిగా ఆలోచిస్తాడని, ఆటగాళ్లలో భరోసా నింపుతాడని తెలిపాడు.

Having Ravi Shastri with the team is a massive boost: Virat Kohli

రవిశాస్త్రి జట్టుతోపాటు ఉండటం అపార బలాన్ని చేకూర్చుతుందని కోహ్లీ తెలిపాడు. శాస్త్రి జట్టుతోపాటు ఉండటం ఎంతో అవసరమని చెప్పాడు.

ముఖ్యంగా తన బ్యాటింగ్ మెరుగయ్యేందుకు శాస్త్రి ఇచ్చిన సలహాలు ఎంతగానో దోహదపడ్డాయని కోహ్లీ పేర్కొన్నాడు. ఇందుకు తాను అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పాడు.

English summary
Indian Test captain Virat Kohli has hailed the BCCI's decision to retain Ravi Shastri as Team Director for the upcoming cricket tour of Bangladesh, saying that the former skipper infuses confidence in the side.
మీ వ్యాఖ్య రాయండి