Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్: రాయల్ ఛాలెంజర్స్‌పై కన్నేసిన జెఎస్‌డబ్ల్యు

Posted by:
Published: Tuesday, June 2, 2015, 12:48 [IST]

బెంగుళూరు: ఐపీఎల్‌ 8లో రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుని జెఎస్‌డబ్ల్యు కొనుగోలు చేయనుందా అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. జెఎస్‌డబ్ల్యు గ్రూపు ఎకనమిక్ అనలిస్ట్, జెఎస్‌డబ్ల్యు ఛైర్మన్ కుమారుడు పెర్త్ జిందాల్ ఈ విషయమై స్పందించారు.

ఈ సందర్భంగా పెర్త్ జిందాల్ మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ప్రాంచైజీని కొనుగోలు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. డియాజియో, విజయ్ మాల్యాకి మధ్య కొన్ని సమస్యలున్నాయి. ప్రస్తుతం మాల్యా వాటిల్లో బిజీగా ఉన్నారు.

చర్చలు జరుగుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ జట్టుని కోనుగోలు చేసేందుకు తాము ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. రాయల్ ఛాలెంజర్స్ జట్టుకి కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కర్ణాటకలో స్పోర్ట్స్ విభాగంలో జెఎస్‌డబ్ల్యు తన పరిధిని విస్తరించుకునే ప్రయత్నంలోనే ఈ డీల్‌పై ఆసక్తిని కనబరుస్తోంది.

JSW keen to buy Royal Challengers Bangalore

విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఇప్పటికే మూతపడిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు. 2011లో ఐపీఎల్ ప్రాంఛైజీని అడ్డుపెట్టుకుని డబ్బు కాజేశాడని ఆరోపణలు వస్తున్నాయి.

రూ. 10 ముఖ విలువ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు వాటాను రూ. 3,62,240లకు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) అమ్మేశాడంట. ఈ లావాదేవీలో యూఎస్ఎల్‌కు చెందిన రూ. 170 కోట్లను రాయల్ ఛాలెంజర్స్ ఖాతాకు బదలాయించారు.

2011లో విరాట్ కోహ్లీని మాత్రమే అంటిపెట్టుకున్న విజయ్ మాల్యా మిగతా ఆటగాళ్లందరినీ వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వేలంపాటలో సుమారు రూ. 55 కోట్లు వెచ్చించి ఏబీ డివిలియర్స్, సౌరభ్ తివారీ లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత 2013లో యూఎస్ఎల్‌ను అంతర్జాతీయ బేవరేజెస్ కంపెనీ డియాజియోకు విక్రయించాడు.

English summary
JSW's interest in the Indian Premier League (IPL) team Royal Challengers Bangalore may be true after all.
మీ వ్యాఖ్య రాయండి