Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఏది నిజం: గంగూలీతో పని ద్రావిడ్‌కు ఇష్టం లేకేనా?

Posted by:
Published: Tuesday, June 2, 2015, 18:48 [IST]

ముంబై: భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడ్వైజరీ కమిటీలో మెంబర్స్‌గా చేరారు. సమకాలీన క్రికెట్లో దిగ్గజ ఆటగాడైన రాహుల్ ద్రావిడ్ పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది.

ఎంతో సహనశీలిగా, అనుభవజ్ఞుడిగా, జట్టు సారథిగా పని చేసిన ద్రావిడ్ పేరను బోర్డు విస్మరించిందనే విమర్శలు వచ్చాయి. సమాచారం మేరకు, తొలుత లక్ష్మణ్ పేరు స్థానంలో ద్రావిడ్‌ను అనుకున్నారు. అయితే గంగూలీతో కలిసి పని చేయడం ఇష్టం లేకనే తన పేరు వద్దని ద్రావిడ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

Rahul Dravid not comfortable working with Sourav Ganguly as BCCI advisor: reports

ఇదే సమయంలో ఆయనను కోచ్ పదవికి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నందునే సలహా కమిటీలో తీసుకోలేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. గంగూలీతో ద్రావిడ్ కంపోర్టబుల్‌గా పని చేయలేరనే భావనతోనే ఆ పేరు జాబితాలో లేదని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.

English summary
Rahul Dravid has always tried to stay as much away as possible from controversies, and if reports are to believed, the omission of his name from BCCI's high-profile Cricket Advisory Committee is because he isn't comfortable working with his former captain Sourav Ganguly.
మీ వ్యాఖ్య రాయండి