Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లా పర్యటన: టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి

Posted by:
Published: Tuesday, June 2, 2015, 12:09 [IST]

న్యూఢిల్లీ: జూన్ 7 నుంచి బంగ్లా పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ప్రస్తుత డైరెక్టర్ రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరించనున్నారు. బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్‌, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్‌గా రామకృష్ణ శ్రీధర్‌‌లను నియమిస్తున్నట్లు బీసీసీఐ పేర్కొంది.

బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. బంగ్లాదేశ్ పర్యటన ముగిసిన అనంతరం పూర్తి స్ధాయి కోచ్‌ నియామకం ఉంటుందని తెలిపారు. బంగ్లా పర్యటనలో భాగంగా జూన్ 10 నుంచి 24 వరకు టీమిండియా ఒక టెస్టు, మూడు వన్డేలను ఆడుతుందని అన్నారు.

Ravi Shastri named Team India's interim coach for Bangladesh tour

టస్టు ట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని, వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తారని బీసీసీఐ పేర్కొంది. రవిశాస్త్రి టీమిండియా తరుపున 80 టెస్టులు, 150 వన్డే మ్యాచ్ లాడిన అనుభవం ఉంది. అంతేకాదు, 1983 వరల్డ్ కప్‌ని సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నారు.

ఆస్టేలియాలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ 2015 పర్యటనలో టీమిండియా డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆస్టేలియాలో జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ ఢంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే.

English summary
Former Indian captain Ravi Shastri was named as Team India's interim coach for tour of Bangladesh starting June 10.
మీ వ్యాఖ్య రాయండి