Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అండర్-19 కోచ్ రేసులో రాహుల్ ద్రావిడ్

Posted by:
Published: Wednesday, June 3, 2015, 13:21 [IST]

ముంబై: భారత అండర్-19, ఎ-జట్లకు రాహుల్ ద్రావిడ్‌ను కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై బోర్డు, ద్రావిడ్‌ తొందర్లోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. సలహా కమిటీలో పాత్ర కంటే భారత క్రికెట్‌లో క్రియాశీలకంగా ఉండేందుకే ద్రావిడ్‌ మొగ్గుచూపాడని తెలుస్తోంది.

ఐపీఎల్లో రాజస్థాన్‌కు మెంటార్‌గా ఉన్న రాహుల్‌ యువ ఆటగాళ్లలో ప్రతిభను గుర్తించడంలో సిద్ధహస్తుడు. సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లు భారత క్రికెట్ నియంత్రణ మండలి అడ్వైజరీ కమిటీలో మెంబర్స్‌గా చేరిన విషయం తెలిసిందే. ద్రావిడ్‌ను విస్మరించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

వాల్ సేవలు లేకుండా పునర్నిర్మాణం అసంపూర్ణం: దాల్మియా

ద్రావిడ్‌కు బీసీసీఐ వ్యవహారాల్లో ఉన్నత ప్రాధాన్యం ఉంటుందని బీసీసీఐ అధ్యక్షుడు జగ్‌మోహన్‌ దాల్మియా చెప్పారు.

దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సహకారం లేకుండా దేశ క్రికెట్‌ పునర్నిర్మాణం అసంపూర్తిగా ఉంటుందని పేర్కొన్నాడు. అతనికి తొందర్లోనే తగిన బాధ్యతలు అప్పగిస్తామని చెప్పాడు. తగిన సమయంలో ద్రావిడ్‌ సేవలు వినియోగించుకుంటామని బోర్డు కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపాడు.

English summary
A day after naming Sachin Tendulkar, Sourav Ganguly and VVS Laxman as part of a three-man cricket advisory committee, the BCCI is preparing to announce a formal association with Rahul Dravid as well.
మీ వ్యాఖ్య రాయండి