Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మాజీ లెజెండ్ క్రికెటర్ల కోసం సరికొత్త ట్వంటీ20 లీగ్

Posted by:
Published: Wednesday, June 3, 2015, 11:57 [IST]

దుబాయ్: మాస్టర్ ఛాంపియన్స్ లీగ్ పేరుతో మరో ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ బుధవారం ప్రారంభం కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగే ఈ ట్వంటీ20 క్రికెట్‌లో మాజీ క్రికెటర్లు ఆడనున్నారు. ఈ టోర్నమెంట్‌ని ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డీన్ జోన్స్‌కు చెందిన జీఎమ్ స్పోర్ట్స్ క్రీడల సంస్ధ నిర్వహిస్తుంది.

Gilchrist, Lara likely to play in new T20 tournament - Masters Champions League

ఈ సందర్భంగా ఆస్టేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ మాట్లాడుతూ ఈ ఐకానికి టోర్నమెంట్‌ను రాబోయే 10 సంవత్సరాల పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ట్వంటీ20 ఫార్మెట్‌లో ఉండే ఈ టోర్నమెంట్‌లో మాజీ ఐకానిక్ లెజెండ్ క్రికెటర్లు ఆడతారని అన్నారు.

ఈ టోర్నమెంట్‌లో బ్రియాన్ లారా, ఆడమ్ గిల్‌క్రిస్ట్, అలెన్ బోర్డర్, రమీజ్ రాజా లాంటి మాజీ లెజెంట్ క్రికెటర్లు ఆడతారని తెలుస్తోంది. ఈ ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో హై ఫ్రొపైల్ అంతర్జాతీయ క్రికెటర్లుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్‌ను నిర్వహించేందుకు గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆమోదం తెలిపింది. బుధవారం ఈ లీగ్‌ని ఐసీసీ కూడా అధికారికంగా ప్రకటించనుంది.

English summary
There is one more Twenty20 cricket league set to be launched. And it will be played in the United Arab Emirates (UAE) with some of the past stars in action.
మీ వ్యాఖ్య రాయండి