Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్లిష్ట ప్రత్యర్థి: సచిన్‌పై మైకేల్ క్లార్క్ ప్రశంసలు

Published: Wednesday, June 3, 2015, 18:44 [IST]

మెల్బోర్న్: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌పై ఆస్ట్రేలియా టెస్ట్‌ క్రికెట్‌ కెప్టెన్‌ మైకెల్‌ క్లార్క్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఆడిన క్రికెటర్‌లందరిలో సచిన్‌ టెండూల్కరే మేటి అని క్లార్క్‌ అన్నాడు.

మైకెల్‌ క్లార్క్‌ తన అభిమానులతో ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఆస్ట్రేలియా బౌలర్లు షేన్‌ వార్న్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, దక్షిణ ఆఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కలిస్‌, వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రియాన్‌ లారాలకు తర్వాతి స్థానాలు ఇస్తానని పేర్కొన్నాడు.

Michael Clarke names Sachin Tendulkar as one of the 'toughest' opponents

బ్రియాన్ లారా తన ఆల్ టైమ్ ఫేవరైట్ అని చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టులో తనకు నచ్చని క్రికెటర్ ఎవరంటే మాత్రం.. రికీ పాంటింగ్ అని తెలిపాడు. తాను ఇంత వరకు ఎదుర్కొన్న బౌలర్లలో ఇంగ్లాండ్ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ ఉత్తమ బౌలర్ అని చెప్పాడు.

స్పీడ్ బౌలర్లలో పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ పేరును ప్రస్తావించాడు. డొమినికాలో బుధవారం రాత్రి వెస్టిండీస్ జట్టుతో జరిగే తొలి టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియా జట్టుకు క్లార్క్ నాయకత్వం వహిస్తున్నాడు. కాగా, క్లార్క్‌ ఇప్పటికే వన్డే ఇంటర్నేషనల్‌, టీ20మ్యాచ్‌ల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

English summary
Australian Test cricket team captain Michael Clarke has named Indian cricketer Sachin Tendulkar as one of the toughest opponents that he has played against in his career so far.
మీ వ్యాఖ్య రాయండి