Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కొత్త లీగ్ సచిన్ Vs వార్న్: ఐసీసీ అనుమతి..!

Posted by:
Published: Thursday, June 4, 2015, 9:04 [IST]

దుబాయ్: ట్విట్టర్‌లో #SachinversusWarne అనే ట్వీట్ హాల్‌చల్ చేస్తుంది. క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ సొంతంగా ఒక ట్వంటీ20 లీగ్‌ను ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ ట్వంటీ20 లీగ్‌కు అనుమతి ఇవ్వాలని సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ ఐసీసీకి విజ్ఞప్తి చేశారు.

ఇందులో భాగంగా సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హెడ్ ఆఫీసుకి వెళ్లారు. ఐసీసీ కార్యనిర్వహక అధికారి డేవ్ రిచర్డ్స్‌సన్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి ఒక ట్వంటీ20 లీగ్ టోర్నమెంట్‌ని ప్రారంభిచనున్నట్లు ఐసీసీ అధికారులతో మాట్లాడారు.

#SachinversusWarne - Legends' new T20 league gets ICC nod

ఈ విషయాన్ని ఐసీసీ అధికారి కూడా ధృవీకరించారు. బుధవారం ఉదయం సచిన్, షేన్ వార్న్ ఇద్దరూ డేవ్ రిచర్డ్స్‌సన్‌ కలిశారు. లీగ్‌కు సంబంధించిన వివరాలను డేవ్ రిచర్డ్స్‌సన్‌‌తో చర్చించారని అన్నారు. 'ఐసీసీ రాజ్యాంగం ప్రకారం ఈ లీగ్‌కు అనుమతించే అధికారం మాకు లేదు. లీగ్‌కు అనుమతివ్వాల్సింది సంబంధిత బోర్డే' అని చెప్పారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్రికెట్‌కు విశేష ఆదరణ కోసం ఈ ట్వంటీ20 లీగ్‌ను అమెరికాలోని చికాగో, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్ నగరాల్లో ఈ ఏడాది చివరలో నిర్వహించాలని సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్‌లు ఆలోచనలో ఉన్నారు.

English summary
Sachin Tendulkar and Shane Warne met International Cricket Council (ICC) officials to get approval for their Twenty20 league and the sport's world governing body has given the green signal to the legendary duo's new venture.
మీ వ్యాఖ్య రాయండి