Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అనుష్క ఆశ్చర్యపోయింది, నేను ఏడ్చేశాను: కోహ్లీ

Posted by:
Updated: Thursday, June 4, 2015, 13:40 [IST]

న్యూఢిల్లీ: నేను నేనేనని, తాను ఎవరి కోసం మారనని చెప్పిన విరాట్ కోహ్లీ తన ప్రియురాలి అనుష్క శర్మ పైన కూడా స్పందించాడు. దూకుడు తగ్గించుకోమని పలువురు సీనియర్లు సూచించిన విషయం తెలిసిందే. దీనిపై కోహ్లీ.. నేను ఎవరి కోసమే మారనని చెప్పాడు.

నేను టెస్టు కెప్టెన్‌ కాబోతున్న విషయం గురించి ఏమాత్రం ఆలోచించలేదని చెప్పాడు. తన గదికి వెళ్లి అనుష్కకు విషయం చెప్పానని తెలిపాడు. ఆమె కూడా భిన్నమైన అనుభూతికి లోనైంది. ధోనీ రిటైర్మెంట్ పైన అనుష్క కూడా ఆశ్చర్యపోయిందని చెప్పాడు. ఎమ్మెస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో తాను ఏడ్చేశానని విరాట్ కోహ్లీ చెప్పాడు.

26 ఏళ్లకే నేను భారత టెస్టు కెప్టెన్‌ అవుతానని ఎన్నడూ ఊహించలేదన్నాడు. తన వైఫల్యానికి అనుష్కతో ముడిపెట్టడం మూర్ఖత్వమన్నాడు. అసలు అన్నింటికీ ఆడవాళ్లను నిందించే సంస్కృతి మన దేశంలో ఉందని వాపోయాడు.

కొంతమంది అమ్మాయిలే పుట్టకూడదనుకుంటారని, ఇంకొందరు వారిపై వివక్ష చూపిస్తారని, అనుష్క విషయంలోనూ కొందరు బాధాకరమైన రీతిలో స్పందించారన్నాడు. తమ వ్యక్తిగత జీవితాల్ని గౌరవించమని ఎవరినీ బలవంతపెట్టనన్నాడు.

Virat Kohli Gives an Insight on his Simple 'Partnership' With Anushka Sharma

దిష్టిబొమ్మలు తగులబెట్టే వాళ్లకు ఒక్కటే చెప్పదలుచుకున్నానని, తమకు కుటుంబాలున్నాయని, వాళ్లూ బాధపడతారని, మేమూ మనుషులమే అన్నాడు. మాకూ భావోద్వేగాలుంటాయన్నాడు. ఈ సంగతి తెలియాలనే అప్పట్లో ఘాటుగా స్పందించానని చెప్పాడు.

అనుష్కకు ఇంతకుముందు క్రికెట్‌ మీద ఏమాత్రం ఆసక్తి లేదని, తనతో పరిచయమయ్యాకే ఆట గురించి తెలుసుకుంటోందని, మ్యాచ్‌లు చూస్తోందని, క్రికెట్‌ గురించి తన సందేహాలు తన దగ్గర తీర్చుకుంటుందని, ఐతే మరీ ఎక్కువగా క్రికెట్‌ గురించి అడిగి ఇబ్బంది పెట్టదన్నాడు.

కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎవరి శైలి వారిదని, పోలికలు ఎందుకన్నాడు. కొందరు ప్రశాంత చిత్తంతో ఉంటారని, ఎక్కువగా స్పందించరని, తనది భిన్నమైన వ్యక్తిత్వమని చెప్పాడు. నేను ఎవరి కోసం నన్ను నేను మార్చుకోనని చెప్పాడు.

సచిన్‌ తన మార్గదర్శి అని, అతను ఇలా చెయ్యి, అలా చెయ్యొద్దు అని ఎప్పుడూ చెప్పడన్నాడు. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానాలిస్తాడని చెప్పాడు. తన అభిప్రాయాలు చెబుతాడని, అంతే తప్ప నీకిదే సరిపోతుంది, అది సరిపోదు అని చెప్పడన్నాడు. మంచి ఇన్నింగ్స్‌ ఆడితే బాగా ఆడావని ఒక్క మాట మాత్రమే అంటాడన్నాడు.

Story first published:  Thursday, June 4, 2015, 12:56 [IST]
English summary
Virat Kohli Gives an Insight on his Simple 'Partnership' With Anushka Sharma
మీ వ్యాఖ్య రాయండి