Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జింబాబ్వే ఆటగాళ్లకు పాకిస్తాన్ ఆ హామీ ఇచ్చింది

Posted by:
Published: Thursday, June 4, 2015, 11:42 [IST]

లాహోర్: పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడేందుకు జింబాబ్వే జట్టుకు, ఆ జట్టు ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ముందుగానే ఫైనాన్షియల్ హామీ ఇచ్చింది. ఒక్కో ఆటగాడికి 12,500 అమెరికన్ డాలర్లు ఇచ్చేందుకు పీసీబీ అంగీకరించిందని తెలుస్తోంది.

మార్చి 2009 నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో ఇతర క్రికెట్ జట్లు పర్యటించలేదు. ఈ నేపథ్యంలో తమ దేశంలో పర్యటించేందుకు జింబాబ్వే జట్టుకు పాకిస్తాన్ డబ్బులపై హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని మొదటే చెల్లించింది. అయితే, దీనిపై పీసీబీ ఇప్పటి వరకు స్పందించలేదు.

కాగా, ఐసీసీ అధ్యక్షుడిగా పీసీబీ నామినేట్ చేసిన మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ తమ దేశంలో సిరీస్‌లు ఆడేందుకు విదేశీ జట్లు ఎక్కువ సంఖ్యలో ముందుకొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Zimbabwe players given financial guarantee by PCB for tour

శ్రీలంక క్రికెటర్లపై 2009 మార్చి 3న ఉగ్రవాదులు దాడి జరిపిన తర్వాత పాకిస్తాన్‌లో పర్యటించేందుకు ప్రపంచ దేశాలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జింబాబ్వే జట్టు పాక్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.

ఇలావుంటే, జింబాబ్వే ఎలాంటి ఇబ్బంది లేకుండా పాకిస్తాన్‌లో సిరీస్‌ను పూర్తి చేసిందని జహీర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. మరిన్ని జట్లు పాక్‌లో పర్యటించేలా ఐసిసి అధ్యక్షుడి హోదాలో కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. అధ్యక్ష స్థానానికి మాజీ క్రికెటర్లే పోటీ చేసేలా ఇటీవలే ఐసీసీ నిబంధనలను మార్చింది.

వచ్చే ఏడాది నుంచి ఆ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ మార్పు ప్రకారం తాను పదవిలో కొనసాగడానికి అనర్హుడిని అవుతాడనని గుర్తించిన నజాం సేథీ పోటీ నుంచి వైదొలగడంతో, అతని స్థానంలో అబ్బాస్ పేరును పీసీబీ ప్రతిపాదించింది. ఐసీసీ అధికారికంగా అతనిని అధ్యక్షుడిగా ప్రకటించాల్సి ఉంది.

English summary
Zimbabwe players given financial guarantee by PCB for tour
మీ వ్యాఖ్య రాయండి