Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కంటి గాయం: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీ20 హీరో

Posted by:
Published: Friday, June 5, 2015, 17:08 [IST]

లండన్: కంటి గాయంతో ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ 'క్రైగ్ కైస్‌వెట్టర్' అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. 27 ఏళ్ల వయసున్న క్రైగ్ గత ఏడాది సోమర్సెట్‌కు ఆడుతున్న సమయంలో కంటికి, ముక్కుకి గాయాలయ్యాయి.

ఈ గాయాలు తీవ్రతరం అవడంతో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. జూలై 2014లో నార్తస్‌ vs సోమర్సెట్‌ జట్ల మధ్య జరిగిన దేశవాలీ మ్యాచ్‌లో ముక్కు పగలగా, కంటికి తీవ్ర గాయమైంది. గాయల నుంచి కోలుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు.

కంటి గాయం అనుభవం చాలా బాధాకరమైందని, మానసికంగా నన్ను ఎంతో వేధనకు గురి చేసిందని, ఒక ఆటగాడిగా ఆటకు 100 శాతం పూర్తి న్యాయం చేయలేనని తెలియడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

England World T20 final hero quits cricket at 27 due to eye injury

కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన క్రైగ్ కైస్‌వెట్టర్ ఇంగ్లాండ్ తరుపున 46 వన్డేలు, 25 ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడాడు. 2010లో కరేబియన్‌లో ఇంగ్లాండ్ జట్టు వరల్డ్ ట్వంటీ20 గెలిచిన జట్టులో సభ్యుడు. ఆస్టేలియాతో జరిగిన వరల్డ్ ట్వంటీ20 ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

ఫైనల్ మ్యాచ్‌లో 49 బంతుల్లో 63 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా సంతతికి చెందిన క్రైగ్ కైస్‌వెట్టర్ తన 9 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

English summary
An eye injury has forced England wicketkeeper-batsman and World Twenty20 winner Craig Kieswetter to retire from cricket at a young age.
మీ వ్యాఖ్య రాయండి