Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ద్రావిడ్ ఉండాల్సింది: కోహ్లీ, అనుష్కవద్ద పిల్లాడిలా

Posted by:
Published: Friday, June 5, 2015, 12:41 [IST]

న్యూఢిల్లీ: బీసీసీఐ సలహా మండలిలో మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఉంటే బాగుండేదని భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయపడ్డాడు. నలుగురు దిగ్గజాలూ సలహా మండలిలో ఉంటే చాలా గొప్పగా ఉండేదని కానీ, ద్రావిడ్‌కు ఏవో ఇతర బాధ్యతలు ఉండి ఉంటాయన్నాడు.

ద్రావిడ్ సేవలను ఏదో రకంగా ఉపయోగించుకుంటామని బీసీసీఐ తెలిపింది. దేశవాళీని బలోపేతం చేయడానికి, కఠిన విదేశీ పర్యటనలకు భారత జట్టును సంసిద్ధం చేయడానికి దిగ్గజాల సలహాలు తీసుకుంటామని బీసీసీఐ చెప్పింది.

Rahul Dravid in advisory committee would have been amazing: Virat Kohli

ఎంతోమంది యువ క్రికెటర్లు ఈ దిగ్గజాలను చూస్తూ ఎదిగారని, వాళ్లు సలహా మండలిలో ఉండడం చాలా మంచి విషయమని, వాళ్లు తమకు ఎన్నో విధాలుగా సహాయపడతారన్నాడు. రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా ఎంత కాలం ఉంటే అంత మంచిదన్నాడు.

కాగా, మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకనటను విని తాను ఆశ్చర్యపోయానని విరాట్ కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. తాను అనుష్కకు ఫోన్ చేస్తే ఆమె కూడా ఆశ్చర్యపోయారని, ఎందుకిలా చేశాడని అడిగిందని చెప్పాడు. ఆ సమయంలో తాను ఏడ్చానని చెప్పాడు. ఆ సమయంలో ఆతను చిన్నపిల్లాడిలా ఏడ్చాడట.

English summary
Rahul Dravid in advisory committee would have been amazing: Virat Kohli
మీ వ్యాఖ్య రాయండి