Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బంగ్లా టూర్: అందరి దృష్టీ భజ్జీపైనే

Published: Saturday, June 6, 2015, 17:23 [IST]

కోల్‌కతా: బంగ్లాదేశ్ పర్యటనకు ముందు రెండు రోజుల ట్రైనింగ్ క్యాంప్ కోసం ఇక్కడి చేరుకున్న టీమిండియా శని, ఆదివారాల్లో నెట్స్‌కు హాజరవుతోంది. సోమవారం ఉదయం బంగ్లాదేశ్‌కు బయలుదేరే ముందు, ఉదయం మీడియా సమావేశంలో పాల్గొంటుంది.

All eyes on Harbhajan Singh as cricketers gather for training camp at Eden Gardens

కాగా, విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత క్రికెటర్లు ఇక్కడికి చేరుకోగా, అందరి దృష్టీ చాలా కాలం తర్వాత టీమిండియాలో చేరిన హర్భజన్ సింగ్‌పైనే కేంద్రీకృతమైంది. ట్రైనింగ్ సెషన్‌లోనూ భజ్జీనే స్టార్ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు.

2013లో ఆస్ట్రేలియాతో హైదరాబాద్‌లో అతను చివరి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాలో స్థానం సంపాదించలేకపోతున్న అతనికి సెలక్టర్లు అనూహ్యంగా ఆహ్వనం పలికారు.

English summary
All eyes would be on off-spinner Harbhajan Singh, who is making a comeback after two years, as the Indian Test cricketers will assemble at the Eden Gardens for a training camp ahead of their short tour to Bangladesh.
మీ వ్యాఖ్య రాయండి