Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

జ్వరం: బంగ్లా టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం

Posted by:
Published: Sunday, June 7, 2015, 11:03 [IST]

కోల్‌కత్తా: కర్ణాటక యువ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్ పర్యటనకు దూరమయ్యాడు. టెస్టుల్లో టీమిండియా ఓపెనర్‌గా రాణిస్తోన్న డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. డెంగ్యూ జ్వరం నుంచి ఇంకా కోలుకోక పోవడంతో రాహుల్‌ బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ నుంచి తప్పుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

23 ఏళ్ల కేఎల్ రాహుల్ గత ఏడాది ఆస్టేలియా పర్యటనలో భాగంగా టీమిండియా తరుపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఆస్టేలియా పర్యటనలో సిడ్నీలో జరిగిన టెస్టులో సెంచరీ సాధించాడు. జూన్ 10 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో అతని స్ధానంలో ఇంకా ఎవరినీ ప్రకటించలేదు.

India opener KL Rahul ruled out of Bangladesh Test

బంగ్లా పర్యటన కోసం టీమిండియా సోమవారం కోల్‌కత్తా నుండి బయలుదేరనుంది. బంగ్లా పర్యటనలో టీమిండియా ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డేలను ఆడనుంది.

English summary
Talented Karnataka opener Lokesh Rahul was today ruled out of the Indian cricket team's upcoming tour of Bangladesh as he is yet to recover from dengue.
మీ వ్యాఖ్య రాయండి