Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నచ్చిన పని దొరికింది: ద్రావిడ్, బ్రిలియంట్: పీటర్సన్

Posted by:
Published: Monday, June 8, 2015, 12:51 [IST]

న్యూఢిల్లీ: యువ ఆటగాళ్లతో పని చేయడం తనకు ఎప్పుడు ఇష్టమని క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ అన్నారు. ఆయన భారత్ ఏ, అండర్ 19 కోచ్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

యువ క్రికెటర్లకు తగిన సలహాలు ఇచ్చి వారిని మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ సమయం కోస ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు.

rahul dravid

ఎప్పటి నుండో తాను ఇలాంటి ఉద్యోగం చేయాలని అనుకుంటున్నానని, భవిష్యత్తులో భారత క్రికెట్ మరింత బలోపేతం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని, తనకు ఉన్న అనుభవంతో వారికి సహాయం చేయగలననే నమ్మకం ఉందని చెప్పారు.

జాతీయ జట్టుకు కోచ్‌గా మారేందుకు ఈ అవకాశం ఉపయోగించుకుంటారా అని ప్రశ్నిస్తే.. అలాంటి ఆలోచన లేదన్నారు. జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేయాలన్న ఆసక్తి తనకు లేదని, ఏడాదికి ఆరు వారాలు భారత్ ఏ జట్టుతోను, మరో ఆరేడు వారాలు అండర్ 19 జట్టుతోను తన ప్రయాణం ఉంటుందన్నారు.

అండర్ 19, భారత్ ఏ జట్టుకు ద్రావిడ్ కోచ్‌గా నియమించడాన్ని పీటర్సన్ ప్రశంసించాడు. ఇది బ్రిలియంట్ అన్నాడు. ద్రావిడ్ సూచనలు, సలహాలు తీసుకునే ఆటగాళ్లు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారోనని ట్వీట్ చేశాడు.

English summary
Always been interested in working with young players: Dravid
మీ వ్యాఖ్య రాయండి