Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌పై బంగ్లా ఆటగాడికి వరల్డ్ రికార్డ్ సమం చేసే ఛాన్స్?

Posted by:
Published: Tuesday, June 9, 2015, 12:16 [IST]

ఫతుల్లా: బంగ్లాదేశ్, భారత్ మధ్య జరగనున్న టెస్టు మ్యాచ్‌ జూన్ 10 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఫ్యాన్స్ చూపంతా ఆ దేశ యువ క్రికెటర్ మోమినుల్ హక్ పైనే ఉన్నాయి.

ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లా యువ ఆటగాడు మోమినుల్ హక్ అర్ధ సెంచరీ సాధిస్తే దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ రికార్డుని సమం చేయనున్నాడు.

23 ఏళ్ల మోమినుల్ హక్ ఆడిన టెస్టుల్లో 11 వరుస అర్ధ సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ వరుస టెస్టుల్లో 12 అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. నవంబర్ 2012 నుంచి 2014 మధ్య కాలంలో ఆడిన వరుస టెస్టు మ్యాచ్‌ల్లో ఏబీ డెవిలియర్స్ ఈ ఫీట్‌ని సాధించాడు.

Can Bangladeshi batsman equal Test world record against India?

అక్టోబర్, 2013న న్యూజిలాండ్‌తో మొదలైన మోమినుల్ హక్ వరుసగా 11 అర్ధ సెంచరీలు సాధించి వివ్ రిచర్డ్స్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల రికార్డుని సమం చేశాడు. తాజాగా గత నెలలో పాకిస్ధాన్‌పై ఆడిన టెస్టు మ్యాచ్‌లో 68 పరుగులు సాధించాడు.

బంగ్లా పర్యటనలో భాగంగా టీమిండియా ఒక టెస్టు మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. టెస్టు సిరిస్ జూన్ 18 నుంచి ప్రారంభం అవుతుంది. బంగ్లాదేశ్‌పై ఆడిన అన్ని టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించింది.

వరుస టెస్టు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు:

12 - ఏబీ డెవిలియర్స్ (దక్షిణాఫ్రికా)

11 - మోమినుల్ హక్, వివ్ రిచర్డ్స్ (వెస్టిండిస్), గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్

10 - జాక్వస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా), సచిన్ టెండూల్కర్ (ఇండియా)

English summary
When Bangladesh and India take the field in their one-off Test tomorrow (June 10) here, the local fans will have their eyes on one batsman, who is on the verge of equalling Test world record.
మీ వ్యాఖ్య రాయండి