Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇద్దరు డబుల్ సెంచరీలు: రికార్డు భాగస్వామ్యం 403

Posted by:
Published: Tuesday, June 9, 2015, 11:31 [IST]

బెంగుళూరు: కర్టాటక ఆటగాళ్లు పవన్ దేశ్‌పాండే, అనిరుథ జోషి అరుదైన రికార్డుని నెలకొల్పారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో నిర్వహించిన డివిజన్ ఐ లీగ్ మ్యాచ్‌లో వీరిద్దరూ డబుల్ సెంచరీలు సాధించి 403 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వల్టర్స్ క్రికెట్ క్లబ్ Vs సోషల్ క్రికెటర్స్ మధ్య జూన్ 6, 7 తారీఖుల్లో జరిగిన మ్యాచ్‌లో రెండో రోజు 5వ వికెట్ భాగస్వామ్యానికి ఈ అరుదైన రికార్డుని సాధించారు. 25 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన పవన్ దేశ్‌పాండే కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపించడంతో పాటు 258 బంతుల్లో 204 పరుగులు(3x3, 24x4) సాధించాడు.

టీమిండియా టెస్టు ఆల్ రౌండర్‌కు మేనల్లుడైన అనిరుథ జోషి 199 బంతుల్లో 212 పరుగులు సాధించాడు. 90 ఓవర్ల మ్యాచ్‌లో వీరిద్దరూ డబుల్ సెంచరీలు సాధించడంతో జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 458 పరుగులకు చేరింది.

Karnataka batsmen hit double tons, set partnership record of 403

ఐ డివిజన్ లీగ్ మ్యాచ్‌లో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు డబుల్ సెంచరీలు సాధించడం ఇదే తొలిసారని, 90 ఓవర్ల మ్యాచ్‌లో రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఒక ప్రకటనలో పేర్కొంది.

ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వల్టర్స్ 3 పాయింట్లు సాధించగా, సోషల్ క్రికెటర్స్‌కు 1 పాయింట్ వచ్చింది. వల్డర్స్ తరుపున కర్ణాటక రంజీ ఆటగాడు కరుణ్ నాయర్ ఆడటం విశేషం. 4 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్‌కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడిన మిస్టరీ స్పిన్నర్ కేసీ కరియప్ప ఈ టోర్నమెంట్‌లో 30 ఓవర్లు వేసి 130 పరుగులిచ్చి ఒక వికెట్ తీసి రికార్డు నెలకొల్పాడు. వల్టర్స్ క్రికెట్ క్లబ్ 90 ఓవర్లకు గాను 5 వికెట్లను కోల్పోయి 458 పరుగులు చేయగా, సోషల్ క్రికెటర్స్ 9 వికెట్లను నష్టపోయి 327 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది.

English summary
Karnataka's Pavan Deshpande and Anirudha Joshi struck unbeaten double centuries and were involved in an unfinished record 403-run partnership in a Division I league match organised by the Karnataka State Cricket Association (KSCA) at the M Chinnaswamy Stadium.
మీ వ్యాఖ్య రాయండి