Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఐపీఎల్ వల్లే అలా, ఇంగ్లాండ్ వద్దంటే మాకు: గేల్

Posted by:
Published: Wednesday, June 10, 2015, 13:15 [IST]

లండన్: ఐపీఎల్ కారణంగానే భారత క్రికెట్‌ ప్రమాణాలు ఎంతో మెరుగయ్యాయని వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్‌ గేల్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం భారత క్రికెట్‌ను చూడాలని, అన్ని ఫార్మాట్లలోనూ వారు ఆధిపత్యం చలాయిస్తున్నారన్నాడు.

ఇందుకు కారణం ఐపీఎలే కారణమని తన అభిప్రాయంగా చెప్పాడు. ఈ టోర్నీలో భారత కుర్రాళ్లు అంతర్జాతీయ ఆటగాళ్లతో భుజాలు రాసుకుని తిరుగుతారని, డ్రెస్సింగ్‌రూంలు పంచుకుంటారని, వాళ్లేం ఆలోచిస్తారో వీళ్లకు తెలుసునని, ఈ కుర్రాళ్లంతా దేశానికి ప్రాతినిధ్యం వహించినపుడు ధైర్యంగా ఆడుతున్నారని చెప్పాడు.

 Chris Gayle Believes IPL Responsible for Indian Cricket's Rise

ఇది అద్భుతమైన విషయమన్నాడు. ఇంగ్లీష్‌ కౌంటీ జట్టు సోమర్‌సెట్‌కు ఆడి, కరీబియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ కోసం వెస్టిండీస్‌కు వెళ్తున్న గేల్‌ ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో ఆడేందుకు ఆ దేశ బోర్డు అవకాశమివ్వాలన్నాడు.

పీటర్సన్‌ను ఇంగ్లాండ్‌ జట్టులోకి తీసుకోకపోవడం వల్ల నష్టం వారికేనన్నాడు. పీటర్సన్‌ కచ్చితంగా ఇంగ్లాండ్‌కు ఆడాలని, అతడిని దూరం పెట్టడానికి ఏ కారణాలైనా ఉండొచ్చునని, ఐతే నష్టం మాత్రం ఇంగ్లాండ్‌కేనని చెప్పాడు.

ఆ దేశ క్రికెట్‌ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో కేపీ ఒకడన్నాడు. ఇంగ్లాండ్‌కు అతను అవసరం లేకుంటే కరేబియన్ లీగ్ కోసం తాము తీసుకుంటామని, అభిమానులను అలరిస్తాడని చెప్పాడు.

English summary
Chris Gayle Believes IPL Responsible for Indian Cricket's Rise
మీ వ్యాఖ్య రాయండి