Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మరో టీ20 జట్టు షారుక్ సొంతం, జూహీ పెట్టుబడి

Posted by:
Published: Wednesday, June 10, 2015, 12:07 [IST]

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ మరో ట్వంటీ 20 ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ట్రినిడాడ్ అండ్ టుబాగోను షారుక్ కొన్నాడు.

సీపీఎల్ జూన్ 20వ తేదీ నుండి జూలై 26వ తేదీ వరకు మూడో ఎడిషన్ ఆడనుంది. ఇందులో క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో తదితరులు ఆడనున్నారు.

Going global: Shah Rukh Khan now owns another T20 team

డ్వేన్ బ్రావో.. షారుక్ ఖాన్‌కు చెందిన ట్రినిడాడ్ అండ్ టుబాగో జట్టులో ఉన్నాడు. జాక్వెన్ కల్లిస్ కూడా ఉన్నాడు. కల్లిస్ గతంలో ఐపీఎల్లో కోల్‌కతా తరఫున ఆడాడు.

షారుక్‌కు చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్, కేకేఆర్ సహ యజమాని జూహీచావ్లా, ఆమె భర్త జైమెహతాలు ట్రినిడాడ్ అండ్ టుబాగో టీంకు పెట్టుబడులు పెట్టారని వార్తలు వస్తున్నాయి. షారుక్ మాట్లాడుతూ.. తద్వారా తాము గ్లోబల్‌కు ఎదుగుతున్నామని చెప్పారు.

English summary
Indian Premier League (IPL) team Kolkata Knight Riders' (KKR) owner and Bollywood actor Shah Rukh Khan now owns another Twenty20 franchise - Trinidad and Tobago in the Caribbean Premier League (CPL).
మీ వ్యాఖ్య రాయండి