Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆత్మకథ రాస్తున్న డివిల్లీయర్స్, భారత్‌లో విడుదల

Posted by:
Published: Thursday, June 11, 2015, 12:41 [IST]

కేప్ టౌన్: సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిల్లీయర్స్ ఈ ఏడాది నవంబర్ నెలలో తన ఆత్మకథను విడుదల చేయనున్నాడు. ఈ పుస్తకానికి డివిల్లీర్స్‌ ‘ఏబీ' అనే పేరు పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టకముందు తన జీవితం ఎలా ఉండేదో ఈ పుస్తకంలో చెప్పనున్నాడు.

ఏబీ పుట్టి పెరిగిన ప్రాంతం, తన సోదరులతో క్రికెట్‌ ఆడడం నేర్చుకున్నప్పటి నుండి ప్రపంచం మెచ్చిన ఆటగాడిగా ఎదిగిన క్రమాన్ని పాఠకులు తెలుసుకుంటారని పుస్తక ప్రచురణ కర్త పాన్‌ మెక్‌మిలన్‌ తెలిపాడు.

AB de Villiers' autobiography to be released in November 2015

సంగీతం, వ్యాపారంపై అతనికి ఉన్న ఆసక్తులు, అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో కొనసాగుతూనే వీటికి డివిల్లీయర్స్‌ ఎలా న్యాయం చేశాడనే ఆసక్తికర విషయాలు అందులో చెప్పనున్నాడు.

ఇక దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఏబీ డివిల్లీయర్స్ చెప్పాడు. తన ఆత్మకథ చెప్పేందుకు ఉత్సాహంగా ఉన్నానన్నాడు. దక్షిణాఫ్రికాతో పాటు బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్‌లలో ఏకకాలంలో ఈ పుస్తకం విడుదల కానుంది.

English summary
AB de Villiers' autobiography to be released in November 2015
మీ వ్యాఖ్య రాయండి