Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీమిండియాకు కోచ్ అయ్యే ఉద్దేశం లేదు: ద్రవిడ్

Posted by:
Published: Thursday, June 11, 2015, 11:41 [IST]

ముంబై: టీమిండియా కోట్ పదవి చేపట్టే ఉద్దేశం తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మరోసారి స్పష్టం చేశాడు. ఇండియా-ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా ఎంపికైన రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం తన దృష్టంతా ఆ జట్ల మీదే ఉందని చెప్పాడు.

ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ స్నాతకోత్సవంలో ముఖ్య అతథిగా పాల్గొన్న రాహుల్ ద్రవిడ్ కోచ్ పదవిపై కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ప్రస్తుతానికి ఇండియా-ఏ గురించే ఆలోచిస్తున్నానని చెప్పారు.

సీనియర్ జట్టుపై నా దృష్టి లేదని చెప్పిన ద్రవిడ్, టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి, అతడి బృందం బంగ్లాదేశ్ పర్యటనలో చక్కగా రాణిస్తున్నారని కొనియాడారు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టే ఆలోచనలు ప్రస్తుతానికి లేవని వెల్లడించారు.

 I am not thinking about Team India coach post, says Rahul Dravid

భారత్‌లోని యువ క్రికెటర్లకు సాయం చేయడానికే కొత్త బాధ్యతలు తీసుకున్నానని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్ధాన్ రాయల్స్ మెంటార్‌గా పని చేసిన అనుభవం కూడా ఉపయోగపడుతుందని చెప్పారు.

యువ క్రికెటర్లకు సాయం చేయాలని ఎప్పుడూ కోరుకుంటానని అన్నారు. కెరీర్లో కీలకమైన దశలో ఉంటారు. వారికి నా అనుభవాలు పంచగలిగితే బాగుంటుందని చెప్పిన ద్రవిడ్, ఆ తర్వాతి దశకు వెళ్లడానికి సాయం చేస్తానని చెప్పాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రాహుల్ ద్రవిడ్ టీమిండియా తరుపున 164 టెస్టులాడారు. తన అనుభవాన్ని యువ క్రికెటర్లకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఇటీవలే ద్రవిడ్‌ను బీసీసీఐ, ఇండియా-ఏ, అండర్-19 జట్లకు కోచ్‌‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Former captain Rahul Dravid has emphatically ruled out the notion that he was interested in taking up the India coaching job after Duncan Fletcher's departure.
మీ వ్యాఖ్య రాయండి