Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఫతుల్లా టెస్టు: వర్షం అడ్డంకి, రెండో రోజు ఆట రద్దు

Posted by:
Updated: Thursday, June 11, 2015, 15:15 [IST]

ఫతుల్లా: వర్షం కారణంగా బంగ్లాదేశ్‌, భారత్‌ల మధ్య ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ రెండో రోజు రద్దు అయ్యింది. వర్షం కారణంగా తొలిరోజు కేవలం 56 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా రెండో రోజు ఆట పూర్తిగా రద్దైంది. రెండో రోజు కూడా వరుణుడు ఆటంకం కలిగించాడు.

ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్, ఫతుల్లాలో వర్షం కురుస్తుండటంతో అంపైర్లు ఆటను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

One-off Test: Day 2: Start of play delayed due to heavy rain

తొలి రోజు ఆటకు సంబంధించిన సమాచారం ఇక్కడ చదవండి 

ఫతుల్లాలోని ఖాన్ సాహెబ్ ఉస్మాన్ అలీ స్టేడియంలో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 56 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 239 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 150, మురళీ విజయ్ 89 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా దూకుడుగా ఆడుతున్న సమయంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో 90 ఓవర్లు ఆడాల్సింది టీమిండియా 56 ఓవర్లు మాత్రమే ఆడింది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం రాబోయే మూడు రోజులు కూడా వర్షాలు పడే సూచన ఉందని తెలిపినట్లు సమాచారం.

జట్ల వివరాలు:

బంగ్లాదేశ్: ముసిఫ్కిర్ రహీం (కెప్టెన్), బంగ్లా ఇక్బాల్, ఇమ్రుల్ కయాస్, మోముల్ హక్, షాకిబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, లిట్టాన్- దాస్ (వికెట్ కీపర్), శివగాతా, తజుల్ ఇస్లాం, మహమ్మద్ షాహిద్, జుబిర్ హుస్సేన్

ఇండియా: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, అజింక్య రహానే, రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అశ్విన్, హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, వరుణ్ ఆరోన్, ఇషాంత్ శర్మ.

Story first published:  Thursday, June 11, 2015, 11:13 [IST]
English summary
Heavy rain has delayed the start of play on the second day of the one-off Test between Bangladesh and India here at Khan Shaheb Osman Ali Stadium on Thursday.
మీ వ్యాఖ్య రాయండి