Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మళ్లీ 'శ్రీని'కే పగ్గాలు, ఏసీఏ కార్యదర్శిగా గోకరాజు

Posted by:
Updated: Friday, June 12, 2015, 16:13 [IST]

చెన్నై: బీసీసీఐ మాజీ ఛీప్, ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ ఎన్ శ్రీనివాసన్ తిరిగి మళ్లీ తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన 85వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్ష పదవిలో ఎన్ శ్రీనివాసన్ ఏడాది పాటు కొనసాగుతారు. ట్రెజరర్‌గా వీపీ నరిసంహాన్‌ను ఎన్నికయ్యారు. కార్యదర్శిగా కాశీ విశ్వనాథం ఎన్నికయ్యారు.

ఏసీఏ కార్యదర్శిగా మళ్లీ గోకరాజు గంగరాజు

N Srinivasan re-elected TNCA President

ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శిగా మరోసారి గోకరాజు గంగరాజు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శుక్రవారం ముగిసిన ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో కార్యదర్శిగా గోకరాజు గంగరాజుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా గంగరాజు మాట్లాడుతూ ఏపీలోని 13 జిల్లాల్లో స్టేడియాలు నిర్మిస్తామని తెలిపారు. ఇందుకోసం జిల్లాకు రూ. 15 లక్షలు విడుదల చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతికి సమపంలోని మంగళగిరిలో ఇండోర్ స్టేడియాన్ని నిర్మిస్తామన్నారు.

త్వరలో ఈ పనులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పనుల ప్రారంభోత్సవానికి బీసీసీఐ అధ్యక్షుడిని ఆహ్వానిస్తామని తెలిపారు.

Story first published:  Friday, June 12, 2015, 15:38 [IST]
English summary
Former BCCI chief and current ICC Chairman N Srinivasan was today unanimously re-elected President of the Tamil Nadu Cricket Association at its 85th Annual General Meeting here today.
మీ వ్యాఖ్య రాయండి