Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సీపీఎల్: 'బిగ్ సిక్స్ ఛాలెంజ్'లో పీటర్సన్ Vs గేల్ ఎవరు గెలిచారు? (వీడియో)

Posted by:
Updated: Friday, June 12, 2015, 16:13 [IST]

బెంగుళూరు: 'కరేబియన్ ప్రీమియర్ లీగ్'లో క్రిస్ గేల్, కెవిన్ పీటర్సన్ 'ద బిగ్ సిక్స్ ఛాలెంజ్'ను ఎదుర్కొన్నారు. ఇందులో ఎవరు గెలిచుంటారో గెస్ చేయండి. ఇంకెవరూ సిక్సులు కొట్టడంలో ఆరితేరిన ఆటగాడు, ఐపీఎల్‌లో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న వెస్టిండిగ్ దిగ్గజం క్రిస్ గేలే గెలిచాడు.

'ద బిగ్ సిక్స్ ఛాలెంజ్'కు సంబంధించిన వీడియోని కరేబియన్ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు విడుదల చేశారు. క్రిస్ గేల్ కొట్టిన సిక్స్ 119 మీటర్లు దూరంలో పడగా, కెవిన్ పీటర్సన్ కొట్టిన సిక్స్ 117 దూరంలో పడింది.

కేవలం 2 మీటర్ల దూరంతో ఈ ఛాలెంజ్‌లో క్రిస్ గేల్ గెలిచాడు. మొత్తం 2 నిమిషాల 27 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ వీడియోలో కెవిన్ పీటర్సన్ తనన్ని పరిచయం చేసుకుంటాడు. 'నేను కెవిన్ పీటర్స్‌ని. నేను సెయింట్. లూసికా జోక్స్ తరుపున ఈ బిగ్ సిక్స్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నాను' అని చెప్పారు.

VIDEO: Pietersen Vs Gayle in 'Big Six Challenge' before CPL

ఇక క్రిస్ గేల్ మాట్లాడుతూ 'పరిచయం అక్కర్లేదు. నేను క్రిస్ గేల్' అని చెప్పారు. జమైకా తల్లవాస్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. 'క్రికెట్‌ను ఎవరైతే గట్టిగా ఆడతారో వారి కోసమే ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్ ' అని తెలిపాడు.

'బిగ్ సిక్స్ ఛాలెంజ్‌'లో పాల్గొనడానికి ముందు కెవిన్ పీటర్సన్ ఒక్క ఓవర్‌లో ఎవరు పెద్ద సిక్సుని కొడతారో చూద్దాం అంటూ క్రిస్ గేల్‌ని ఆహ్వానిస్తాడు. దీంతో ఇద్దరూ వారి వారి బ్యాట్స్‌తో బంతిని స్డేడియం బయటకు పంపించారు.

ఈ ఛాలెంజ్‌లో బంతిని ఎక్కువ దూరం పంపించిన క్రిస్ గేల్‌ను విజేతగా ప్రకటిస్తారు. ఈ తతంగం మొత్తం పూర్తయిన తర్వాత ఇద్దరూ ఒకరితో ఒకరు కరచాలనం చేసుకుని నవ్వుకున్నారు. ఇక కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) జూన్ 20 నుంచి మొదలై జులై 26తో ముగుస్తుంది. ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటున్నాయి.

Story first published:  Friday, June 12, 2015, 12:55 [IST]
English summary
In a video released by the organisers of CPL, Gayle and Pietersen showed off their six-hitting skills. The local hero won by smashing the ball to 119 metres while Pietersen fell behind by 2 metres - at 117.
మీ వ్యాఖ్య రాయండి