Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాత టెక్నిక్‌తో 'అటాకింగ్ ధోనీ'ని చూసి ఆశ్చర్యంవద్దు

Posted by:
Published: Sunday, June 14, 2015, 13:54 [IST]

న్యూఢిల్లీ: భారత క్రికెట్ వన్డే సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన పాత టెక్నిక్‌లతో బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచుల సిరీస్‌కు సిద్దమవుతున్నాడు. జూన్ 18వ తేదీ నుండి బంగ్లాదేశ్‌తో భారత్ వన్డే మ్యాచ్ సిరీస్ ఉంది.ధోనీ ఢిల్లీ నేషనల్ స్టేడియంలో బంగ్లా టూర్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నాడు. బ్యాటింగ్ శైలిలో మార్పు కనిపిస్తోంది.

ధోనీ నిరుడు డిసెంబర్ నెలలో టెస్టులకు గుడ్ బై చెప్పాడు. అతను వన్డేలు, టీ20ల పైన దృష్టి సారించాడు. విరాట్ కోహ్లీ టెస్టులకు సారథిగా నియమించబడ్డాడు. బంగ్లాతో జరుగుతున్న టెస్టుకు కోహ్లీయే కెప్టెన్.

టెస్ట్ సిరీస్ కోసం తన బ్యాటింగ్ శైలిని, టెక్నిక్‌ను మార్చుకున్నానని ధోనీ చెప్పాడని, ఇప్పుడు టెస్టుల కోసం ఆలోచించవలసిన పని లేదని, కాబట్టి అతను తన గత టెక్నిక్స్ పైన దృష్టి పెట్టాడని కోచ్ ఎంపీ సింగ్ చెప్పాడు.

'Attacking' MS Dhoni with 'old technique' for Bangladesh ODIs

ధోనీ తన పరిధిని పెంచుకున్నడని, అతను ఫీట్ మధ్య బ్యాట్ ఉంచేవాడన్నాడు. ఇప్పుడు అతను తన గత బ్యాటింగ్ శైలి పైన దృష్టి సారించాడని చెప్పాడు. ధోనీ తన యంగర్ డేస్ వలే బాగా ఆడుతున్నాడని చెప్పాడు. బంగ్లా టూర్లో 'అటాకింగ్ ధోనీ' (విరుచుకుపడే ధోనీ) కనిపిస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదన్నాడు.

బంగ్లాదే‌తో భారత్ మూడు వన్డేలు ఆడనుంది. జూన్ 18న ప్రారంభమవుతుంది. అన్ని మ్యాచులు ఢాకాలో జరుగుతాయి.

భారత్ స్క్వాడ్: ధోనీ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, ఆర్ అశ్విన్, రవీంద్ర జడెజా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్టార్ట్ బిన్నీ, ధవల్ కులకర్ణి.

English summary
India's ODI captain MS Dhoni might be "attacking" the Bangladesh bowlers during the 3-match series starting on June 18 as he has reverted to his old batting technique.
మీ వ్యాఖ్య రాయండి