Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆటగాళ్లకు లంచాలు: ఖండించిన పీబీసీ ఛైర్మన్

Posted by:
Published: Sunday, June 14, 2015, 11:26 [IST]

కరాచీ: గత నెలలో పాకిస్ధాన్‌లో పర్యటించడం కోసం జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలను పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ షహర్యార్ ఖాన్ శుక్రవారం ఖండించాడు.

పాకిస్ధాన్‌లో పర్యటించనందుకు జింబాబ్వే జట్టు ఖర్చుల నిమిత్తం జింబాబ్వే బోర్డుకు రూ. 3.20 కోట్లు చెల్లించినట్టు ఆయన పేర్కొన్నాడు. కానీ, కొంత మంది దీనిని వక్రీకరించి జింబాబ్వే ఆటగాళ్లకు లంచాలు ఇచ్చారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఖాన్ తెలిపాడు.

PCB chief rubbishes rumours of bribing Zimbabwe cricketers

ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ‘ఇరు బోర్డుల అంగీకారంతోనే పర్యటన జరిగింది. ఆ దేశ జట్టును పంపినందుకు గాను జింబాబ్వే అధ్యక్షుడికి.. పాక్‌ ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ సందేశం పంపార'ని షహర్యార్‌ తెలిపాడు.

లాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదన్నారు. 2009 లాహోర్‌లో శ్రీలంక జట్టుపై పాక్ ఉగ్రవాదుల దాడి జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత, పాక్‌లో పర్యటించిన జట్టు జింబాబ్వేనే.

ఈ సిరీస్‌ ద్వారా అభిమానులను స్టేడియాలకు రప్పించగలిగామని, బోర్డుకు కొంతమేర ఆదాయం కూడా సమకూరిందని పీసీబీ చైర్మన్‌ షహర్యార్ ఖాన్ వెల్లడించాడు.

English summary
The Chairman of the Pakistan Cricket Board (PCB) Shaharyar Khan has rubbished allegations that they bribed the Zimbabwean cricketers to tour Pakistan for a short limited over series, last month.
మీ వ్యాఖ్య రాయండి