Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఆ విషయం భజ్జీని అడగండి: ప్రియురాలి గీతాబస్రా

Posted by:
Updated: Monday, June 15, 2015, 9:17 [IST]

ముంబై: హర్భజన్ సింగ్‌కు నేను లక్కీయా కాదా అనే విషయా ఆయనను అడగాలని గీతాబస్రా అన్నారు. భజ్జీ, గీతా బస్రాలు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై గీతా ఎప్పుడు స్పందించిన సందర్భాలు లేవనే చెప్పవచ్చు.

ఆదివారం ఆమె మాట్లాడుతూ.. హర్భజన్‌కు ఆట పైన గల మమకారం చూసి స్ఫూర్తి పొంది సెకెండ్ హ్యాండ్ హజ్బెండ్ సినిమాలో నటించినట్లు చెప్పారుఈ సినిమా ప్రమోషన్‌లో ఆమె మాట్లాడారు. క్రికెట్ అంటే ఇష్టమన్నారు.

Ask Harbhajan Singh if I’m lucky for him: Geeta Basra

ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం భజ్జీ ప్రత్యేకత అన్నారు. అలాంటి మనస్తత్వమే ఉన్న తాను కూడా విరాం తర్వాత నటించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నారా అని ప్రశ్నిస్తే.. ఇలాంటి పుకార్లు విన్నప్పుడు బాధగా ఉంటుందన్నారు.

పెళ్లికి సంబంధించిన విషయంలో దాచేందుకు ఏముందన్నారు. పెళ్లి సమయం వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతానని తెలిపారు. ప్రతి అమ్మాయికి పెళ్లి అనేది ఓ ప్రత్యేకం అన్నారు.

ఏడాది కాలంగా తాను ఏడుసార్లు పెళ్లి చేసుకున్నానని మీడియాను ఉద్దేశించి సెటైర్ వేశారు. ఆమె పెళ్లి చేసుకుంటుందని పలుమార్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె పైవిధంగా స్పందించారు. అలాంటివి తనను ఇబ్బంది పెడుతుంటాయన్నారు.

Story first published:  Monday, June 15, 2015, 9:15 [IST]
English summary
Geeta Basra has never admitted being in a relationship with cricketer Harbhajan Singh, but the actor is a regular in the stands during his matches. Naturally, she is always questioned about it, reacting to which, Basra says, “I feel more like a cricketer now, than an actor!”
మీ వ్యాఖ్య రాయండి