Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రవిశాస్త్రి 'టీమ్ డిన్నర్': భారత్‌దే నైతిక విజయం

Posted by:
Published: Monday, June 15, 2015, 11:51 [IST]

ఫతుల్లా: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసినందుకు గాను కోహ్లీ సేనకు టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి మ్యాచ్ అనంతరం విందు ఇచ్చాడు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని గుల్షన్ ప్రాంతంలోని ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు జట్టు మొత్తాన్ని విందుకు తీసుకెళ్లాడు. మ్యాచ్ డ్రాగా ముగిసిన నేపథ్యంలో భారత్‌దే నైతిక విజయం అన్న ఉద్దేశ్యంతో రవిశాస్త్రి ఈ విందుని ఏర్పాటు చేసినట్లు జట్టు సభ్యులు పేర్కొన్నారు.

Ravi Shastri hosts 'team dinner' after 'moral victory' in one-off Test

దీంతో పాటు టెస్టు జట్టు సభ్యులు హార్భజన్ సింగ్, వికెట్ కీపర్ వర్ధమాన్ సాహా భారత్‌కు వెళ్లిపోవడం కూడా ఈ విందుని ఏర్పాటు చేయడానికి కారణమని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇక టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సోమవారం బంగ్లాదేశ్‌కు రానున్నారు.

సోమవారం విశ్రాంతి తీసుకుని టీమిండియా ఆటగాళ్లు మంగళవారం నుంచి మిర్‌పుర్‌లోని షేర్ బంగ్లా స్టేడియంలో ప్రాక్టీసు మొదలు పెట్టనున్నారు. జూన్ 18 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది.

English summary
Team director Ravi Shastri last night hosted the entire Test squad for 'Team Dinner' to celebrate a good performance in a rain-marred one-off Test which ended in a draw, here.
మీ వ్యాఖ్య రాయండి