Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మరో ప్రమాదం: క్యాచ్ పట్టబోతూ గుద్దుకున్న క్రికెటర్లు

Posted by:
Updated: Monday, June 15, 2015, 11:50 [IST]

లండన్: నాట్ వెస్ట్ టీ20 సందర్భంగా ఇద్దరు క్రికెటర్లు ఒకరికి ఒకరు గుద్దుకొని ఆసుపత్రి పాలైన సంఘటన ఇంగ్లాండులో జరిగింది. అరుండల్ కాస్టిల్ క్రికెట్ క్లబ్ మైదానంలో ఇది ఆదివారం నాడు జరిగింది.

సర్రేస్ తరఫున ఆడుతున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ హెన్రిక్స్, మరో ఆటగాడు రోరీ బర్న్స్‌లు మ్యాచ్ సందర్భంగా ఒకరికి ఒకరు గుద్దుకున్నారు. సస్సెక్స్‌తో మ్యాచ్ జరుగుతుండగా క్యాచ్ పట్టే సమయంలో ఇది చోటు చేసుకుంది.

వారిద్దరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సర్రే కౌంటీ తెలిపింది. రోరీ బర్న్స్, హెన్రిక్స్‌లు పిచ్ పైన పడిపోయిన తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించామని పేర్కొంది.

 T20 Blast: 2 cricketers hospitalised after 'horrible collision' on the field, match abandoned

సస్సెక్స్ బ్యాట్సుమన్ స్టెఫాన్ పియోలెట్ బంతిని కొట్టాడు. హెన్రిక్స్ (28), బర్న్స్ (24)లు క్యాచ్ పట్టేందుకు వచ్చి గుద్దుకున్నారు.

వారి మైదానంలో పడిపోవడంతో మూడు అంబులెన్సులు వచ్చాయి. వారిని 45 నిమిషాల తర్వాత ఆసుపత్రికి చేర్చినట్లుగా తెలుస్తోంది.

అనంతరం సర్రే యాజమాన్యం ట్వట్ చేసింది. హెన్రిక్స్ ఎక్స్ రే తీశారని, వాటి కోసం ఎదురు చూస్తున్నట్లుట్వీట్ చేసింది. కాగా, సస్సెక్స్ 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. అనంతరం మ్యాచ్ కొనసాగలేదు.

Story first published:  Monday, June 15, 2015, 10:49 [IST]
English summary
Two cricketers were hospitalised today when they collided during a NatWest T20 Blast match at Arundel Castle Cricket Club Ground.
మీ వ్యాఖ్య రాయండి