Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తన హీరోను కలిసిన టెండుల్కర్, మురిసిపోయాడు

Posted by:
Published: Tuesday, June 16, 2015, 9:15 [IST]

ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తాను ఎప్పటి నుండో కలవాలనుకుంటున్న తన అభిమానిని కలిసి మాట్లాడాడు. జర్మన్‌కు చెందిన టెన్నిస్ దిగ్గజం బోరిస్ బేకర్ చిన్నప్పటి నుండి సచిన్‌కు అభిమానం. ఆయన అభిమానిగా చిన్నప్పుడే మారిపోయాడు.

తాజాగా తన అభిమాన హీరోను కలిశాడు, మాట్లాడాడు. ఫొటో దిగి, ట్విట్టర్‌లో పెట్టి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు. సచిన్ చిన్ననాటి నుంచి అతన్ని చూస్తూనే ఎదిగాడు. అతని విజయాల నుంచే స్ఫూర్తి పొందాడు.

Sachin Tendulkar Meets the Superstar Who Inspired Him as a Child

బెకర్‌ 17 ఏళ్ల వయసులో వింబుల్డన్‌ ఛాంపియన్‌గా నిలవడం చిన్నారి సచిన్‌పై చెరగని ముద్ర వేసింది. ట్విట్టర్‌లో బెకర్‌తో దిగిన ఫొటోను పెట్టిన సచిన్‌.. ''ఎవరో చెప్పుకోండి చూద్దాం! చిన్ననాటి నుంచి ఎవరినైతే ఆరాధిస్తూ పెరిగానో అతనే ఈ టెన్నిస్‌ సూపర్‌స్టార్‌. ఇతనో గొప్ప వ్యక్తి'' అని వ్యాఖ్య రాశాడు.

ఆరుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన బెకర్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. చిన్న వయస్సులోనే వింబుల్డన్ టైటిల్ సాధించిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. కాగా, సచిన్ బెకర్‌తో పాటు మరో టెన్నిస్ దిగ్గజం జాన్ మెకన్రోకు కూడా అభిమాని.

English summary
Sachin Tendulkar Meets the Superstar Who Inspired Him as a Child
మీ వ్యాఖ్య రాయండి